BREAKING : మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సంచలన వ్యాఖ్యలకు కేరాఫ్ అడ్రస్ గా మారారు. ఆయన ఎప్పుడు ప్రెస్ మీట్ లో మాట్లాడినా.. హాట్ కామెంట్స్ చేస్తున్నారు. ఇక తాజాగా.. మరోసారి.. మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు చేశారు.
కూసుమంచి మండలం లోక్యతండా లో మాజీమంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ.. భగవంతుడు ఇచ్చిన శక్తి మేరకు అభివృద్ధి పనులు చేశానన్నారు. మిగిలి ఉన్న పనులు కూడా అధికారుల తో మాట్లాడి పూర్తి చేయిస్తానని హామీ ఇచ్చారు.
నియోజకవర్గంలో జాతీయ రహదారులు రావడం తో భూముల రేట్లు పెరిగాయని వెల్లడించారు. ఉన్నంత కాలం నమ్ముకున్న ప్రజలకు మంచి చేయాలని తెలిపారు. రైతులు కూడా వ్యవసాయం లో లాభసాటి పంటలు సాగు చేయాలని.. అధికారం ముఖ్యం కాదు, అభివృద్ధి తోటే కళ అన్నారు మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. టీఆర్ఎస్ పార్టీ పాలన బాగుందన్నారు.