అల్లరి చేస్తున్నాడని బాలుడిని కొట్టి చంపిన ఘటన కడప జిల్లాలో చోటుచేసుకుంది. కడప జిల్లాలో అభం – శుభం తెలియని పదేళ్ల బాలుడిని స్వయానా మేనత్త, మేన మామ కొట్టి చంపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వైఎస్సార్ జిల్లాలోని ఓంశాంతి నగర్‌కు చెందిన శివయ్య, భాగ్యమ్మ అనే భార్యాభర్తలు.. నెల రోజుల క్రిందట జీవనోపాధి కోసమని గల్ఫ్ దేశాలకు వెళ్లారు. తమ పదేళ్ల కొడుకైన అయాన్‌ను బాలుడి మేనత్త ఇంట్లో వదిలిపెట్టి వెళ్లారు.
అయితే బాలుడు అల్లరి చేస్తున్నాడని విసుగు చెందిన అతని మేనత్త.. అయాన్ తొడ వద్ద కాల్చారు. దాంతో ఆ బాలుడు అపస్మారక స్థితిలోకి వెళ్లగా.. గమనించిన బంధువులు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ బాలుడు మృతి చెందాడు’ అని వెల్లడించారు. అప్పటికే బాలుడు మేనత్త, మామ పరారయ్యారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. పరారీలో ఉన్న బాలుడి మేనత్త, మామ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.