డేంజర్ యాక్సిడెంట్.. లారీ ట్రాలీని వేగంగా ఢీకొట్టిన ఇన్నోవా కారు

-

హన్మకొండలో డేంజర్ యాక్సిడెంట్ సంభవించింది. గురువారం రాత్రి సుబేదారి చౌరస్తా నుంచి గ్రనైట్ లోడుతో వెళ్తున్న భారీ లారీ ట్రాలీని అతివేగంగా దూసుకొచ్చిన ఇన్నోవా కారు ఢీకొట్టింది. కారు వేగంగా వచ్చి ఢీకొనడంతో లారీ ట్రాలీ బ్యాలెన్స్ కోల్పోయి డివైడర్ మీదకు దూసుకెళ్లింది.

ఈ ప్రమాదంలో కారులోని ఐదుగురికి తీవ్రగాయాలు అవ్వగా.. వారిని వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే, ప్రమాదంలో లారీ కరెంట్ పోల్‌ను ఢీకొని ఆగిపోయింది. దీంతో చుట్టుపక్కల ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయినట్లు తెలిసింది.ఈ మేరకు కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తుండగా.. దీనికి సంబంధించిన విజువల్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news