ఈ మధ్యకాలంలో డయాబెటిస్ సమస్య ఎక్కువ అవుతోంది. వయస్సు తో సంబంధం లేకుండా చిన్నవారి నుండి పెద్దవారి వరకు డయాబెటిస్ సమస్యతో బాధపడుతున్నారు. అయితే దీనిని కొన్ని రకాల లక్షణాల ప్రకారం గుర్తించవచ్చు. శరీరంలో ఎప్పుడైతే ఇన్సులిన్ హార్మోన్ అసమతుల్యత ఏర్పడుతుందో డయాబెటిస్ సమస్యను ఎదుర్కొంటారు. కనుక తగిన చర్యలను తీసుకొని రక్తంలోని చక్కర స్థాయిలను సమతుల్యంగా ఉండే విధంగా చూసుకోవాలి. ఈ విధంగా జాగ్రత్తలు తీసుకుంటే ఎక్కువ ప్రమాదం ఉండదు. అదేవిధంగా తరచుగా పరీక్షలు చేయించుకోవడం మరియు మెడికేషన్ ను తీసుకోవడం వంటివి కచ్చితంగా చేయాలి.
సహజంగా డయాబెటిస్ ను ఎదుర్కొన్న కొన్ని రోజులకు బలహీనత ఏర్పడుతుంది. దీంతో అలసట వంటి లక్షణాలు కనబడతాయి. ఎప్పుడైతే రక్తంలో చక్కెర స్థాయిలు అధికంగా ఉంటాయో శక్తి కోసం కణాలు గ్లూకోస్ ని ఉపయోగించుకోవు. ఈ విధంగా శక్తి తగ్గిపోయి ఎంతో అలసిపోతూ ఉంటారు మరియు బలహీనంగా ఉండాల్సి వస్తుంది. డయాబెటిస్ సమస్య వలన నరాల ఆరోగ్యం కూడా తగ్గిపోతుంది. తిమ్మిరి, కాళ్లు నొప్పి, జలధరింపులు వంటి లక్షణాలు కనిపిస్తే తప్పకుండా షుగర్ టెస్ట్ ను చేయించుకోవాలి. కాళ్లు నొప్పితో పాటుగా నడిచేటప్పుడు అసౌకర్యం ఏర్పడటం వంటివి ఏర్పడతాయి. దీనిని డయాబెటిస్ కు లక్షణంగానే తీసుకోవాలి మరియు అశ్రద్ధ చేయకుండా తగిన చర్యలను తీసుకోవాలి.
డయాబెటిస్ సమస్యతో బాధపడేవారు ఎప్పుడైతే నడుస్తారో లేక శారీరిక శ్రమ వంటివి చేస్తారో డయాబెటిస్ సమస్య పెరిగిపోతుంది. అంతేకాక ఊపిరితిత్తులు మరియు గుండె పై ఒత్తిడి పడుతుంది. ఈ విధంగా శ్వాసకు సంబంధించిన సమస్యలు ఏర్పడతాయి. ముఖ్యంగా ఊపిరి తీసుకోవడానికి ఎంతో ఇబ్బంది కలుగుతుంది. ఎప్పుడైతే డయాబెటిస్ సమస్యతో బాధపడతారో పాదాలకు రక్తప్రసరణ అనేది సరిగ్గా జరగదు. దీంతో పాదాలలో వాపు ఎక్కువ అవుతుంది. పైగా ఎక్కువ నడవడం వలన కాళ్ల పై ఒత్తిడి కూడా పడుతుంది. దీంతో వాపు మరింత ఎక్కువవుతుంది.