కరోనాతో ప్రజలు ఎంత ఇబ్బందులు ఎదుర్కొన్నారో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. కేరళ రాష్ట్రంలో మొన్నటిదాకా కరోనా కేసులు వెలుగులోకి వచ్చాయి. ఇక కరోనా కాస్త తగ్గింది అనుకునే లోగా గవదబిళ్ళలు వ్యాధి రాష్ట్రంలో ఎక్కువగా వ్యాప్తి చెందుతోంది. రాష్ట్రంలో ఒక్క రోజే 190 కేసులు నమోదయ్యాయి మార్చి నెలలో ఇప్పటివరకు 2500 మంది ఈ వైరస్ బారిన పడ్డట్టు తెలుస్తోంది. రెండు నెలల్లో 11 వేలకి పైగా ప్రజలు ఈ వ్యాధి భారిన పడ్డట్టు కేరళ ఆరోగ్య మంత్రిత్వ శాఖ చెప్తోంది.
గవదబిళ్ళలు రావడం సాధారణమే పారామిక్సో వైరస్ అనే వైరస్ వలన ఇది వస్తుంది. ఐదేళ్ల నుండి 15 ఏళ్ల మధ్య వయసున్న పిల్లలకి ఎక్కువ అయిదు వస్తుంది గాలిలోని నీటి బిందువుల ద్వారా ఇది వ్యాప్తి చెందుతుంది. ఈ వైరస్ బారిన పడిన వ్యక్తి మూడు లేదా నాలుగు గంటల తర్వాత లక్షణాలు కనబడతాయి గవద బిళ్ళలు వచ్చినప్పుడు పిల్లల లాలాజలా గ్రంధులు వాస్తాయి దీని వలన ఒక్కసారి రెండు వైపులా దవడలు వాపుకి గురవుతాయి.