ప్రస్తుతం దేశంలో వరుసగా జరుగుతోన్న అత్యాచారాలపై ఎవరికి వారు తీవ్రంగా స్పందిస్తున్నారు. సామాన్యుల నుంచి సెలబ్రిటీలు.. అటు సినిమా వాళ్లు… ఇటు రాజకీయ నాయకులు ఎవరికి వారు అత్యాచార నిందితులకు కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు. తాజాగా దిశా సంఘటనతో దేశం అంతా ఉలిక్కిపడింది. ఆ వెంటనే మరో నాలుగైదు ఇదే తరహా సంఘటనలు జరిగాయి.
దిశా సంఘటన తర్వాత రెండు తెలుగు రాష్ట్రాల ప్రముఖులు, రాజకీయ నేతల నుంచి ఉత్తరాది వరకు చాలా మంది స్పందించారు. ఇక సినిమా వాళ్లలో తెలుగు వాళ్ల నుంచి బాలీవుడ్, కోలీవుడ్ ప్రముఖులు వరకు ఎందో స్పందించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని కోరుతున్నారు. అయితే డేనియల్ శ్రవణ్ అనే డైరెక్టర్ మాత్రం ఈ తరహా సంఘటనలపై తీవ్ర వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు విమర్శలకు తావిస్తోంది.
ఆడాళ్లు రేప్ చేసేటప్పుడు రేప్ చేసే వాళ్లకు సహకరించాలి… లేకపోతే వాళ్లు ఎక్కడ పోలీసులకు చెపుతారో ? అని రేపిస్టులు / మగాళ్లు చంపేస్తారు. ప్రభుత్వం రేపిస్ట్‌లపై చట్టాలను రుద్దకపోతే వాళ్లు కూడా ఆడవాళ్లను హత్యలు చేయరు. ఆడాళ్లపై హత్యలు, రేప్‌లు జరగకుండా ఉండాలంటే ఇందుకు రేప్‌లను లీగలైజ్ చేయడం ఒక్కటే మార్గం అని.. ఆడాళ్లు కూడా పోలీసులకు ఫోన్ చేసే బదులు కండోమ్స్ పెట్టుకోండి. వందకి నా బొందకి ఫోన్లు చేసేకంటే పర్సులో కండోమ్స్ పెట్టుకుంటే మంచిది… ప్రాణాలు దక్కుతాయని చెప్పాడు.
అలాగని తాను రేపిస్టులకు సపోర్ట్ చేయడం లేదని.. 18 ఏళ్ల వయస్సు పైన ఉన్న అమ్మాయిలను హింసించకుండా రేప్ చేయవచ్చన్న నిబంధన ఉంటేనే ఆడాళ్ల ప్రాణాలు దక్కుతాయని చెప్పాడు. అలాగే తాను తప్పు మాట్లాడి ఉంటే క్షమించాలని.. తాను ఆడాళ్ల ప్రాణాలు పోకుండా ఉండేందుకే ఇలా చేశానని కూడా చెప్పాడు. ఇక దిశా ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నానని చెప్పాడు. దీనిపై శ్రీపాద చిన్మయి లాంటి వాళ్లు శ్రవణ్‌ను విమర్శిస్తున్నారు… మరికొందరు నిన్ను నరికేస్తానంటున్నారు. మరి కొందరు సపోర్ట్ చేస్తున్నారు.