కొత్త బీర్‌ బ్రాండ్లపై సీఎం రేవంత్‌ రెడ్డి కీలక నిర్ణయం..KF లు ఇక బందేనా !

-

ఎక్సైజ్ శాఖపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. బెవరేజేస్ సంస్థ కింగ్‌ఫిషర్ బీర్లు సరఫరా నిలిపివేతపై చర్చించారు. బెవరేజేస్ సంస్థ బీర్ల ధర 33.1 శాతం పెంచాలని డిమాండ్ చేస్తోందని సమాచారం. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం అందుతోంది. మద్యం సరఫరాపై కంపెనీల ఎంపికలో పారదర్శక విధానం పాటించాలని… కొత్త బ్రాండ్లు సరఫరా చేసేందుకు సులభతర వాణిజ్య విధానం అనుసరించాలని పేర్కొన్నారు.

revanth beer

కొత్త కంపెనీలను అనుమతించే విషయంలో కట్టుదిట్టంగా ఉండాలని… కొత్త కంపెనీల నుంచి అప్లికేషన్లు తీసుకునేందుకు నోటిఫికేషన్ జారీ చేసి కనీసం నెల రోజులు నిర్ణీత గడువు ఇవ్వాలని ఆదేశించారు. ఆ కంపెనీలు తమ బ్రాండ్ల పేర్లతో దరఖాస్తు చేసుకోవాలని… కంపెనీల నాణ్యత ప్రమాణాలు, సరఫరా సామర్థ్యం పరిశీలించి పారదర్శకంగా ఈ ఎంపిక ప్రక్రియ చేపట్టాలని తెలిపారు. యునైటెడ్ బేవరేజస్ కంపెనీ బీర్ల రేట్లను 33.1 శాతం పెంచాలన్న ఒత్తిడికి తలొగ్గేది లేదన్నారు. గత ఏడాదిగా ఎక్సైజ్ శాఖకు ఎప్పటికప్పుడు బిల్లులు చెల్లిస్తున్నామని తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Exit mobile version