టిఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం రెండు పార్టీల మధ్య మాటల యుద్ధానికి తెలలేపింది. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై తాజాగా మరోసారి స్పందించారు నిజామాబాద్ బిజెపి ఎంపీ ధర్మపురి అరవింద్. ఈ వ్యవహారానికి నలుగురు తాగుబోతు ఎమ్మెల్యేలు ప్రగతి భవన్ నుండి డైరెక్షన్ ఇచ్చారని ఆరోపించారు. ఈ డ్రామాలను ప్రజలు చూసి నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ఆ నలుగురు ఎమ్మెల్యేలలో వచ్చే ఎన్నికల్లో ఒక్కరు కూడా గెలవరని జోష్యం చెప్పారు ధర్మపురి అరవింద్.
దేశవ్యాప్తంగా ఇచ్చిన తీర్పు మునుగోడు ఉపఎన్నికలలో ఇస్తారని అన్నారు. బిజెపి పార్టీ దక్షిణ తెలంగాణలో వ్యభింబిస్తుందని.. అందుకే కేసీఆర్ కి నిద్ర పట్టడం లేదని అన్నారు. బిజెపి పార్టీ దేశంలో ఎక్కడా సెట్టింగ్ పార్టీ ఎమ్మెల్యేలను బిజెపిలోకి తీసుకోలేదని అన్నారు. వారి పదవులకి రాజీనామా చేశాక గెలుస్తారని నమ్మకం ఉంటేనే పార్టీలోకి తీసుకుంటామని పేర్కొన్నారు.