బిగ్ బాస్ షోపై ఏపీ హైకోర్టులో పిటిషన్.. నాగార్జునకు నోటీసులు

-

తెలుగు బిగ్ బాస్ షోపై ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలయింది. కాగా ఈ పిటిషన్ పై గురువారం హైకోర్టు విచారణ చేపట్టింది. విచారణ అనంతరం ఈ షోకు హస్ట్ గా వ్యవహరిస్తున్న టాలీవుడ్ నటుడు అక్కినేని నాగార్జునకు నోటీసులు జారీ చేసింది. నాగార్జునతో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా హైకోర్టు నోటీసులు జారీ చేసింది. బిగ్ బాస్ లో అశ్లీలత ఎక్కువగా ఉందని, ఫ్యామిలీతో కలిసి చూసే పరిస్థితి లేదని… ఈ నేపథ్యంలో బిగ్ బాస్ షోను రద్దు చేయాలంటూ ఇటీవలే హైకోర్టులో ఓ పిటిషన్ దాఖలైంది. ఈ పిటషన్ పై ఇప్పటికే రెండు దఫాలుగా విచారణ జరగగా.. తాజాగా గురువారం జరిగిన విచారణలో ప్రతివాదులకు నోటీజులు జారీ అయ్యాయి. రెండు వారాల్లో నోటీసులకు సమాాధానం ఇవ్వాలని కోర్టు… నాగార్జునతో పాటు కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేసింది.

అంతకుముందు విచారణలో భాగంగా.. బిగ్ బాస్ తెలుగు షోపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో కనీసం రెండు లేదా మూడు ఎపిసోడ్‌లను చూస్తామని ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ డీవీఎస్‌ఎస్ సోమయాజులతో కూడిన ధర్మాసం స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. అలాగే పిటిషన్‌పై తదుపరి విచారణను నేటికి(అక్టోబర్ 27) వాయిదా వేసింది. నేడు విచారణ సందర్భంగా హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version