రాష్ట్రంలో టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయం బీజేపీ మాత్రమే : దాసోజు శ్రవణ్‌

-

తెలంగాణలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి కాంగ్రెస్‌తో పాటు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో.. మునుగోడులో ఉప ఎన్నిక అనివార్యమైంది. అయితే.. ఎన్నికల సంఘం ఇంకా ఉప ఎన్నికకు సంబంధించి ఎలాంటి నోటిఫికేషన్‌ను విడుదల చేయనప్పటికీ.. రాజకీయ పార్టీలు మాత్రం ముందుగానే ఉప పోరుకు సిద్ధమవుతున్నాయి. అయితే.. రాష్ట్రంలో టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయం బీజేపీ మాత్రమే అని దాసోజు శ్రవణ్ అన్నారు. నిరంతరం ప్రజా సమస్యలపై పోరాటం చేస్తూ ప్రజల అభిమానం పొందుతోందని చెప్పారు దాసోజు శ్రవణ్ . బీజేపీలో చేరిన తర్వాత తొలిసారి రాష్ట్రానికి వచ్చిన ఆయనకు శంషాబాద్ ఎయిర్ పోర్టులో బీజేపీ నేతలు ఘనస్వాగతం పలికారు.

కేసీఆర్ నియంతృత్వ ధోరణితోనే కాళేశ్వరం, మేడిపల్లి నీట మునిగిందని..లక్షా యాభై వేల కోట్ల ప్రజాధనాన్ని కేసీఆర్ అనాలోచితంగా నీటిపాలు చేశారని ఆరోపించారు దాసోజు శ్రవణ్. కాళేశ్వరం ముంపుపై కనీసం రివ్యూ చేయకపోవడం దుర్మార్గమన్నారు దాసోజు శ్రవణ్. తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే కేసీఆర్ కేంద్రంపై అనవసర విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు దాసోజు శ్రవణ్. రాష్ట్రంలో తుగ్లక్ పాలన కొనసాగుతోందని విమర్శించారు. ప్రజలు కుటుంబ పాలనకు చరమగీతం పాడి బీజేపీని ఆశీర్వదించాలని కోరారు దాసోజు శ్రవణ్. ప్రజాస్వామిక తెలంగాణ కోసం నిరంతరం కృషి చేస్తానని స్పష్టం చేశారు. మునుగోడులో కాషాయ జెండా ఎగరడం ఖాయమని దీమా వ్యక్తం చేశారు దాసోజు శ్రవణ్.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version