సీఎం జగన్, అవినాష్ రెడ్డి తో నాకు ప్రాణహాని ఉంది – దస్తగిరి

-

వైయస్ వివేకా హత్య కేసులో అప్రూవర్ గా మారిన దస్తగిరి సంచలన వ్యాఖ్యలు చేశాడు. వైయస్ కుటుంబం నన్ను తొక్కాలని చూస్తోంది…నేను పులివెందుల లో జగన్ కాలనీలో నివాసం ఉంటున్నానని తెలిపాడు. జగన్ మోహన్ రెడ్డి ఇంటి దగ్గరలో నివాసం ఉంటున్న..సునీతమ్మ 75వేలు నాకు ఇచ్చిందని ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు.

 

నేను సునీతమ్మ దగ్గర నుండి ఒక రూపాయి కూడా తీసుకోలేదు…సునీతమ్మ దగ్గర గానీ సిబిఐ దగ్గర నుండి గానీ డబ్బులు తీసుకున్నట్లు నిరూపిస్తే జైలుకు పోవడానికి సిద్దం అని సవాల్ చేశారు. నిరూపించలేకపోతే మీరు మీ పదవులకు రాజీనామా చేసి జైలు కు వెళ్లే శక్తి మీకు ఉందా?వైయస్ కుటుంబానికి సవాల్ విసురుతున్నా అని పేర్కొన్నారు.మీ డ్రామాలు,మీ అక్రమాలకు సమయం దగ్గర పడింది.అవినాష్ రెడ్డి, జగన్ మోహన్ రెడ్డి ద్వారా నాకు ప్రాణహాని ఉందని ఆరోపణలు చేశారు.

 

సిబిఐ అధికారులు వారి కోణంలో విచారణ చేస్తున్నారు…నీకు నచ్చిన కోణంలో ఎందుకు విచారణ చేస్తారన్నారు. వివేకా హత్య లో మీ పాత్ర ఉందని సిబిఐ కి తెలుసు…అప్రూవర్ గా మారనంత వరకు దస్తగిరి మంచోడేనని పేర్కొన్నారు. అప్రూవర్ గా మారి వాంగ్మూలం ఇచ్చిన తర్వాత దస్తగిరి చెడ్డవాడు గా కనిపిస్తున్నాడు…వివేకా హత్య కేసులో న్యాయం గెలవాలని కోరారు దస్తగిరి.

Read more RELATED
Recommended to you

Exit mobile version