కన్న తల్లిని చావగొట్టిన కూతురు..వీడియో వైరల్

-

నవమాసాలు మోసి కని పెంచిన తల్లిని దారుణంగా చావగొట్టిందో దుర్మార్గపు కూతురు. కొట్టొద్దని ఆ తల్లి కన్నీళ్లతో వేడుకున్నా కనికరించలేదు. జుట్టు లాగి చెంప పగలగొట్టింది. కాలితో తన్నింది. తల్లి శరీరంపై పలు చోట్ల కొరికింది. సుమారు మూడు నిమిషాల పాటు రాక్షసకాండ కొనసాగించింది.

ఎక్కడ పడితే అక్కడ కొడుతూ గిచ్చడం వంటి నీచపు పనలకు పాల్పడింది. ఆ తల్లి రోదన విని అందరూ కంటతడి పెట్టుకునేలా దృశ్యాలు ఉన్నాయి. ఈ దారుణ ఘటన హరియాణాలో జరగగా ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఈ శాడిస్ట్ కూతురిని కఠినంగా శిక్షించాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. కాగా, తల్లిని కూతురు ఎందుకు ఇలా చిత్రహింసలకు గురిచేసిందనే విషయం ఇంకా తెలియరాలేదు.

Read more RELATED
Recommended to you

Latest news