డే టూ డే కరోనా లక్షణాలు…!

-

ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ కేసులు రోజు రోజుకి పెరుగుతున్నాయి. ప్రజలకు ఇప్పుడు ప్రాణ భయం మొదలయింది. ఇళ్ళ నుంచి బయటకు రావాలి అంటేనే భయపడే పరిస్థితి ఏర్పడింది. అసలు కరోనా సోకితే మీకు ఎలా తెలుస్తుంది…? ఏయే లక్షణాలు మీలో కనిపిస్తాయి… మీరు ఎప్పుడు బాగా ఇబ్బంది పడతారు…? ఒకసారి ఈ స్టోరీ చూడండి…

డే 0 – వికారంగా అనిపిస్తుంది. దీనిని జీరో డే అనడానికి మరో కారణం చాలా మందికి ఈ లక్షణం కనపడలేదు.

డే 1 – ముందు జ్వరం రాగా 24 గంటలు దాటిన తర్వాతి నుంచి ఇతర సమస్యలు తీసుకొస్తుంది.

డే 2 – అలసట, ఒళ్లునొప్పులు, పొడి దగ్గు… ఇవి కనపడతాయి.
డే 3 – అలసట, ఒళ్లునొప్పులు, పొడి దగ్గు అనేవి మరింత ఎక్కువగా కనపడటమే కాదు జ్వరం కూడా పెరిగే అవకాశం ఉంటుంది.
‌‌డే 4 – అలసట, ఒళ్లునొప్పులు, పొడి దగ్గు, జ్వరం తీవ్రత ఎక్కువ.
డే 5 – ఊపిరి తీసుకోవడం కష్టం కష్టంగా ఉంటుంది. వృద్దులకు ఇది మరీ ఎక్కువగా ఉంటుంది.
డే6 – డే 5 లాగే ఉంటుంది. కాని కొంచెం తీవ్రత ఎక్కువ.
డే 7 – మొదటి ఆరు రోజుల్లో ఆస్పత్రిలో చేరాలి లేకపోతే సమస్యల తీవ్రత ఎక్కువగా ఉంటుంది.

డే 8 -ARDS అనే సమస్య బయటపడుతుంది. దీనినే ఎక్యూట్ రెస్పిరేటరీ డిస్ట్రెస్ సిండ్రోమ్ అని అంటారు. ఊపిరి తిత్తులు పూర్తిగా దెబ్బ తిని చనిపోయే అవకాశం ఉంటుంది. అయితే అది రెండు శాతం.

డే 9 – ARDS సమస్య తీవ్రమవుతుంది.
డే 10 – పేషెంట్‌ని ICUలో చేర్చుతారు వైద్యులు.. కడుపులో నొప్పి రావడం ఆకలి వేయకపోవడం… లేదా చనిపోవడం.
డే 17 – మొదటి వారంలో ఆస్పత్రిలో చేరితే మాత్రం 16 రోజుల్లో బయటపడతారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version