ఏపీలో క‌రోనా క‌ట్ట‌డికి ఇదే బెస్ట్ మెడిసిన్‌… దీనికి మించింది లేదుగా…!

-

ఏపీ.. ప్ర‌స్తుతం ప్ర‌భుత్వం చెబుతున్న ప్ర‌కారం.. దేశంలోని ఇత‌ర రాష్ట్రాల‌తో పోల్చుకుంటే .. మ‌న ద‌గ్గ‌ర క‌రోనా కేసులు త‌క్కువ‌. కానీ, వాస్త‌వం చూస్తే.. మాత్రం మ‌రో నెల రోజులు ఆగితేనే త‌ప్ప అస‌లు ఏపీలో క‌రో నా ప‌రిస్థితిని అంచ‌నావేయ‌లేమ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఇది ముమ్మాటికీ వాస్త‌వం. ప‌క్క‌నే ఉన్న తె లంగాణ‌లోనూ కేసుల సంఖ్య రెండు వంద‌ల కు పెరిగినా.. ఇక్క‌డ ఏపీలో మాత్రం యాభైలోపే న‌మోద య్యా యి. దీనిని బ‌ట్టి ప్ర‌భుత్వానికి పైవిధ‌మైన ఆలోచ‌న వ‌చ్చి ఉండాలి. కానీ, ఏప్రిల్ మొద‌టి వారానికి వ‌చ్చే స‌రికి తెలంగాణ‌తో ఏపీ పోటీ ప‌డుతున్న ప‌రిస్థితి మ‌న‌కు క‌నిపిస్తోంది.

పాజిటివ్ కేసులు కానీ, మ‌ర‌ణాలు కానీ ఇప్పుడు తెలంగాణ‌తో పోటీ ప‌డుతోంది. మ‌రో ప‌క్క‌నున్న రాష్ట్రం ఒడి సాలో ఈ ప్ర‌మాదం లేదు., అక్క‌డ మ‌ర‌ణాలు ఇప్ప‌టి వ‌ర‌కు చోటు చేసుకోలేదు. అయినా కూడా అక్క‌డి ప్ర భుత్వం కేంద్ర ప్ర‌భుత్వంతో సంబంధం లేకుండానే ఏప్రిల్ 30 వ‌ర‌కు లాక్‌డౌన్ను అమ‌లు చేస్తామ‌ని చెప్పే సింది.  కానీ, ఏపీలో మాత్రం ప్ర‌భుత్వం లాక్‌డౌన్ విష‌యంలో త‌ట‌ప‌టాయిస్తోంది. ఇక‌, ప్ర‌జారోగ్యం ప‌రంగా చూస్తే.. క‌రోనా కేసుల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. రోజుకు ప‌దుల సంఖ్య‌లో కేసులు న‌మోదు అవుతున్నాయి.

ఈ ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తే.. ఏపీలో లాక్‌డౌన్ను కొన‌సాగించి తీరాల‌నే వాద‌న ప్ర‌బ‌లంగా వినిపిస్తోంది. నిజానికి ఒడిసా వంటి రాష్ట్రాల‌తో పోల్చుకుంటే.. మ‌న ద‌గ్గ‌ర ఆర్థిక పరిస్థితి బెట‌రే! ఈ నేప‌థ్యంలో ఏపీలో కేసుల తీవ్ర‌త త‌గ్గాలంటే లాక్‌డౌన్‌ను ఏప్రిల్ 30 త‌ర్వాత కూడా పొడిగించాల‌నే వాద‌న వినిపిస్తోంది. ఇప్ప టికిప్పుడు లాక్‌డౌన్‌ను ఎత్తేయ‌డం వ‌ల్ల విప‌త్క‌ర ప‌రిస్థితిలోకి ఏపీ జారుకోవ‌డం త‌ధ్య‌మ‌ని అంటు న్నారు. ఈ క్ర‌మంలో ప్ర‌భుత్వం ఎలాంటి నిర్ణ‌యం తీసుకున్నా కూడా ప్ర‌జ‌లు మాత్రం లాక్‌డౌన్కే మొగ్గు చూపాల నేది నిపుణుల మాట‌.

మ‌నిషి బ‌తికి ఉంటే.. ఈ రోజు కాక‌పోతే..రేపు ఆర్ధికంగా సంపాయించుకుంటారు. అస‌లు ప్రాణాల మీదికే తెచ్చుకుంటే ప‌రిస్థితి రేపు మ‌రింత దారుణంగా ఉంటుంద‌నే వాస్త‌వం తెలుసుకోవాల‌ని సూచిస్తున్నారు. మ‌రి ప్ర‌జ‌లు లాక్‌డౌన్‌కే మొగ్గు చూపాల్సిన ప‌రిస్థితి ఉంద‌నేది వాస్త‌వం. మ‌రి ఏం చేస్తారో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version