మరో రికార్డును అందుకున్న డివిలియర్స్‌

-

తాజగా రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు ఆటగాడు ఎబి డివిలియర్స్ సరికొత్త రికార్డును అందుకున్నాడు. తాజాగా ఐపీఎల్ 13వ సీజన్లో భాగంగా సోమవారం నాడు రాయల్ చాలెంజర్స్, బెంగళూరు కోల్కత్తా నైట్ రైడర్స్ తలపడగా అందులో ఎబి డివిలియర్స్ ఆకాశమే హద్దుగా రెచ్చిపోయాడు. కేవలం 33 బంతుల్లో 5 ఫోర్లు 6 సిక్సర్ల సహాయంతో 73 పరుగులు రాబట్టాడు. దీంతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మొదట బ్యాటింగ్ చేసిన నేపథ్యంలో 20 ఓవర్లలో 194 పరుగులు సాధించింది. ఇక లక్ష చెదనలో దిగిన కోల్కత్తా నైట్ రైడర్స్ జట్టు కేవలం నిర్ణీత 20 ఓవర్లలో 112 పరుగులు మాత్రమే చేసి ఏకంగా 82 పరుగుల తేడాతో భారీగా ఓడిపోయింది. ఇక ఈ మ్యాచ్ లో కీలక పాత్ర పోషించిన మిస్టర్ 360 కి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు గెలుపొందాడు.

అయితే ఐపీఎల్ లో ఇప్పటివరకు అత్యధికంగా మాన్ అఫ్ ది మ్యాచ్ అవార్డులను అందుకున్న వ్యక్తిగా యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ ఉన్నాడు. తాజాగా గెలుచుకున్న మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు తో ఎబి డివిలియర్స్ క్రిస్ గేల్ రికార్డును బద్దలు కొట్టాడు. క్రిస్ గేల్ మొత్తం 21 మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అందుకోగా తాజాగా ఎబి డివిలియర్స్ 22వ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ ను అందుకున్నాడు. ఇకపోతే ప్రస్తుతం ఐపీఎల్ సీజన్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మూడో స్థానంలో కొనసాగుతోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version