గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఆత్మహత్యలు, హత్యల సంఖ్య క్రమంగా పెరుగుతున్నది. చిన్న చిన్న విషయాలకే చాలా మంది మరణాన్ని తమ చాయిస్గా ఎంచుకుంటున్నారు. ఆత్మహత్య లేకుంటే ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండదని భావిస్తున్నారు. ఫలితంగా బాధ ఏమో కానీ మనిషే లేకుండా పోతున్నామనే విషయాన్ని వారు గుర్తించలేకపోతున్నారు.
తాజాగా జవహర్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దమ్మాయిగూడ నాసిక్ చెరువులో గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్యమైంది.
స్థానికుల సమాచార మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. మృతురాలి మరణం వెనుక ఆత్మహత్య కారణమా? లేక ఎవరైనా హత్య చేసి ఇందులో పడేశారా? అని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.