2047 వరకు ఏపీ తలసరి ఆదాయం రూ.55 లక్షలు ఉండాలి : సీఎం చంద్రబాబు

-

2047 వరకు ఏపీ తలసరి ఆదాయం రూ.55 లక్షలు ఉండాలని.. 2.4 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్తకు చేరాలని  సీఎం చంద్రబాబు ఆకాంక్షించారు. తాజాగా ఆయన అసెంబ్లీలో మాట్లాడారు. దేశంలో అధిక తలసరి ఆదాయం ఉన్న రాష్ట్రం తెలంగాణ. వికసిత్ భారత్ -2047 కల్లా దేశం 30 ట్రిలియన్ డాలర్ల జీడీపీకి చేరాలి. రాష్ట్రంలో నియోజకవర్గ విజన్ డాక్యుమెంట్ అమలు పరిచే బాధ్యత ఎమ్మెల్యేలదే అన్నారు. ఉమెన్ వర్క్ ఫోర్స్ పెరిగితే వేగవంతమైన అభివృద్ధి సాధ్యం అని తెలిపారు. 

లేనిపోని రాజకీయాలు చేయకుండా అన్ని భాషలు నేర్చుకుంటే మంచిది అని సూచించారు సీఎం చంద్రబాబు. ప్రతీ నియోజకవర్గం అభివృద్దికి 10 సూత్రాలు పాటించాలి. కుటుంబం అనేది సోషల్ సెక్యూరిటీ అని తెలిపారు. లాంగ్వేజ్ అనేది ద్వేశించడం కాదు. మాతృభాషను అందరూ కాపాడుకోవాలి. అసాధ్యమైన టార్గెట్ పెట్టుకొని ముందుకెల్లాలని సూచించారు. గత ప్రబుత్వం మాదిరిగా వ్యాపారవేత్తలను తరిమివేయడం కాదు.. వ్యాపారవేత్తలను తీసుకొని రావాలన్నారు. ప్రతీ ఎమ్మెల్యే ఇంటి స్థలం ఇవ్వడం, ఇంటిని నిర్మించే బాధ్యతను తీసుకోవాలని సూచించారు. 

Read more RELATED
Recommended to you

Latest news