యూపీలోని ప్రయాగ్ రాజ్‌లో కొనసాగుతున్న మహాకుంభమేళాలో తీవ్ర విషాదం నెలకొంది. అనుకోకుండా భక్తులు ఎక్కువ సంఖ్యలో రావడంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో సుమారు 20 మందికి పైగా మృతి చెందినట్లు తెలుస్తోంది. వందకు పైగా భక్తులు మృతి చెందినట్లు సమాచారం.
క్షతగాత్రులను వెంటనే స్థానికంగా ఏర్పాటు చేసిన శిబిరాల్లోకి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ విషాదంపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. శిబిరాల్లో చికిత్స పొందుతున్నవారిని వెంటనే ఆస్పత్రులకు తరలించి చికిత్స అందించాలని అధికారుకలకు సూచించారు. ప్రస్తుతం పవిత్ర స్నానాలను రద్దు చేస్తూ యూపీ సర్కార్ నిర్ణయం తీసుకుంది.