పెద్దవాళ్ళు చెప్పిన ప్రతి చిన్న విషయం వెనుక ఒక అర్థం ఉన్నా లేకపోయినా దానిని ఒక సాంప్రదాయంగా భావించి అందరూ పాటిస్తూ ఉంటారు. వాటిలో వాహనాలతో నిమ్మకాయలను తొక్కించడం కూడా ఒకటి. సహజంగా కొత్త వాహనాలను కొనుగోలు చేసినప్పుడు కొన్ని రకాల పూజలను చేస్తూ ఉంటారు. అయితే దానిలో భాగంగా గుడికి తీసుకొని వెళ్లి వాహన చక్రాలు కింద నిమ్మకాయలను పెట్టి తొక్కిస్తారు. అయితే ఇలా చేయడం వలన వాహనం నడిపే సమయంలో ఎటువంటి ప్రమాదం కూడా జరగదు అని హిందువులు ఎంతో బలంగా నమ్ముతారు.
ఈ విధంగా వాహనాలను పూజించడం వలన ఎంతో మంచి జరుగుతుందని భావిస్తారు. కేవలం కొత్త వాహనాలను మాత్రమే కాకుండా కొన్ని పండగలకు కూడా వాహనాలను శుభ్రం చేసి నిమ్మకాయలను తొక్కించడం వంటివి చేస్తూ ఉంటారు. అంతేకాకుండా దీనికి శాస్త్రీయ కారణాలు కూడా ఉన్నాయి. గుర్రపు బండ్లు మరియు ఎడ్లబండ్లు రవాణాకు ఉపయోగించిన రోజులలో ఎంతో దూరం ప్రయాణించేవారు. అలాంటప్పుడు బురద మరియు నీటి మధ్యలో ప్రయాణాలు చేయాల్సి వచ్చేది. దీంతో గుర్రాలు మరియు ఎడ్ల కాళ్లకు కొన్ని రకాల ఇన్ఫెక్షన్లు ఏర్పడేవి.
బురద మరియు మట్టిలో ఉండే క్రిములు గుర్రాలు మరియు ఎడ్ల కాళ్లకు క్రిములు చేరకుండా ఉండడానికి నిమ్మకాయలను తొక్కించేవారు. అయితే ఇదే పద్దతి వాహనాలకు కుడా కొనసాగుతూ వచ్చింది. నిమ్మకాయలలో ఉండే ఎన్నో ఔషధ గుణాలు వీటి కాళ్ళకి ఇన్ఫెక్షన్ రాకుండా చేస్తాయి అని ఈ విధంగా చేసేవారు. దీంతో ప్రయాణం ఎంతో సులువుగా జరిగేది. అయితే ఇదే ప్రక్రియను ఇప్పుడు కూడా హిందువులు పాటిస్తున్నారు. ఈ విధమైన నమ్మకాన్ని రబ్బర్ టైర్లకు కూడా చేస్తున్నారు. అయితే ఇలా చేయడం ఒక సాంప్రదాయంగా మారింది. దీన్ని పాటించడం వలన ఎటువంటి కీడు కుడా జరగదు అని హిందువులు నమ్ముతారు.