డిసెంబర్‌ 30 బుధవారం: రాశి ఫలాలు మరియు పరిహారాలు

-

డిసెంబర్ – మార్గశిర మాసం – 30. బుధవారం.

 

మేషరాశి:ఈరోజు ఆర్థికంగా అనుకూలం !

ఈరోజు చాలా కాలం నుంచి వాయిదా పడుతున్న పనులు చేయటానికి అనుకూలంగా ఉంటుంది. వాటిని విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. ఈరోజు ఉద్యోగంలో మీ పనికి మంచి గుర్తింపు వస్తుంది. ఈరోజు ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. ఆదాయంలో అభివృద్ధి ఉంటుంది. ఈరోజుప్రయాణాలకు అనుకూలం.ఈరోజు సన్నిహితులతో ఉత్సాహంగా గడుపుతారు. ప్రముఖులతో పరిచయాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు మరింత ప్రోత్సాహకరంగా ఉంటాయి.

పరిహారాలుః శ్రీకృష్ణ ఆరాధన చేయండి. అనుకూలంగా ఉంటుంది.

 

todays horoscope

వృషభరాశి:ఈరోజు కుటుంబబాధ్యతలు పెరుగుతాయి !

ఈరోజు ఆరోగ్య విషయంలో జాగ్రత్త. ఈరోజు మానసికంగా ఆందోళనగా ఉంటుంది. ఆహార విషయంలో జాగ్రత్త. ఈరోజు ప్రయాణంలో మార్పు. ఉద్యోగంలో మార్పు ఉంటుంది. ఈరోజు వ్యాపార లావాదేవీలకు అనుకూల రోజు కాదు. ఈరోజు దైవ దర్శనం చేసుకుంతారు.  ఆధ్యాత్మిక క్షేత్రాల్ని సందర్శిస్తారు.ఈరోజు ఆలోచనలు కలసిరావు. కుటుంబబాధ్యతలు పెరుగుతాయి. మిత్రులతో వివాదాలు. వ్యాపారాలు సాదాసీదాగా ఉంటాయి.

పరిహారాలుః ఆదిత్య పారాయణం  చేయండి. అనుకూల ఫలితాలు వస్తాయి.

 

మిథునరాశి:ఈరోజు శుభకార్యాలు నిర్వహిస్తారు !

ఈరోజు పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఈరోజు ఇంటికి సంబంధించిన విషయాలకు ఎక్కువ సమయం కేటాయిస్తారు. వాహన కొనుగోలు చేస్తారు.ఈరోజు ఆర్థికంగా  సామాన్యంగా ఉంటుంది. మానసిక ఆందోళనకు, ఆవేశానికి గురికాకండి. ప్రశాంత చిత్తంతో ఉంటేనే అన్ని పనులు చేయగు-లుగుతారు. ఈరోజు ఇంటిలో శుభకార్యాలు నిర్వహిస్తారు. ఈరోజు పరిచయాలు పెరుగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతనోత్సాహం.

పరిహారాలుః తెల్లజిల్లేడుతో శివరాధన చేయండి.

 

కర్కాటకరాశి:ఈరోజు మానసికంగా ఉత్సాహంగా ఉంటారు !

ఈరోజు అనుకూలంగా ఉంటుంది. ఈరోజు మీ వృత్తి పరంగా మంచి గుర్తింపును పొందుతారు. ఉద్యోగంలో ముఖ్య సమాచారం అందుతుంది. ఈరోజు మిత్రులను , బంధువులను కలుస్తారు. మానసికంగా ఉత్సాహంగా ఉంటారు. నిరుద్యోగులకు ఉద్యోగలాభం. ఈరోజు ఆస్తి వివాదాలు తీరతాయి. ఈరోజు వ్యాపారాలు విస్తరిస్తారు.

పరిహారాలుః శ్రీ సత్యనారాయణస్వామి ఆరాధన చేయండి.

 

సింహరాశి:ఈరోజు ఉద్యోగాలలో అనుకోని మార్పులు !

ఈరోజు మానసికంగా అశాంతిగా ఉంటారు. పని చేయటానికి బద్దకిస్తారు. ఈరోజు ముఖ్యమైన పనులు వాయిదా వేసే అవకాశముంటుంది. ఈరోజు ఆహార విషయంలో జాగ్రత్త. ఈరోజు దూర ప్రయాణాల విషయంలో అనుకూలంగా ఉంటుంది.ఈరోజు చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. పనుల్లో కొంత జాప్యం. ఈరోజు బంధువులతో మాటపట్టింపులు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకోని మార్పులు.

పరిహారాలుః శ్రీ సూర్యారాధన చేయండి.

 

కన్యారాశి:ఈరోజు చేపట్టిన పనులు పూర్తి చేస్తారు !

ఆర్థికంగా ఈరోజు అనుకూలిస్తుంది. ఈరోజు మొండి బకాయిలు వసూలవుతాయి. ఆర్థికాభివృద్ధిలో మీరు అనుకున్న లక్ష్యాలను చేరుకోవటానికి చెసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఈరోజు చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. ఉద్యోగంలో మార్పులు ఉంటాయి.ఇంటా బయటా సమస్యలు పరిష్కారం అవుతాయి. ఉన్నత విద్యకు  అవకాశాలు వస్తాయి.

పరిహారాలుః రామాలయంలో ప్రదక్షణలు, పూలమాల సమర్పణ చేయండి.

 

తులారాశి:ఈరోజు మిశ్రమఫలితాలు వస్తాయి !

ఈరోజు మీరు తీసుకునే నిర్ణయాల విషయంలో కూడా జాగ్రత్త.కొత్త వ్యక్తులు పరిచయమవుతారు. ఈరోజు మిశ్రమఫలితాలు వస్తాయి. తప్పుడు ఆరోపణలు ఎదుర్కోవాల్సి వస్తుంది. మీ కుటుంబ సభ్యుల ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. ఈరోజు మీరు ఉహించని మార్పులకు అవకాశముంది.

పరిహారాలుః గురుగ్రహారాధన చేయండి.

 

వృశ్చికరాశి:ఈరోజు ఉత్సాహంగా ఉంటారు !

ఈరోజు ఆనందంగా గడుపుతారు. ఈరోజుఅనుకున్న పనులు నెరవేర్చుకోగలుగుతారు. అవకాశాలు అందివస్తాయి. ఈరోజుఆరోగ్యం బాగుంటుంది. ఈరోజు మానసికంగా ఉత్సాహంగా ఉంటారు.ఈరోజు నిరుద్యోగులకు ఉద్యోగలాభం. సంఘంలో గౌరవం. నూతన ఒప్పందాలు. ఈరోజు వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి.

పరిహారాలుః నవగ్రహస్తోత్రం పారాయణం చేయండి.

 

ధనుస్సురాశి:ఈరోజు మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది !

ఈరోజు వృత్తిలో అనుకూలంగా ఉంటుంది. వాయిదా పడుతున్న పనులు ఈరోజు పూర్తవుతాయి. ఉద్యోగ విషయంలో శుభవార్త వింటారు. ఈరోజు మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. మీ ఆర్థిక పరిస్థితిని బలోపేతం చేసుకోవడానికి కొత్త ప్రాజెక్ట్లను ఒప్పుకుంటారు. వైవాహిక జీవితం సాఫీగా సాగుతుంది.

పరిహారాలుః శ్రీకాలభైరవాష్టకం పారాయణం చేయండి.

 

మకరరాశి:ఈరోజు పనులలో ఆటంకాలు !

ఈరోజు  వ్యవహారాల్లో జాగ్రత్త. కొత్త వ్యక్తుల కారణంగా ,నూతన లావాదేవీల కారణంగా డబ్బు నష్ట-పోయే అవకాశముంటుంది. ఈరోజు  శతృవులమీద ఒక కన్నేసి ఉంచండి. ఈరోజు ఆర్థికంగా నష్టపోయే అవకాశముంటుంది. పెట్టుబడులకు అనువైన రోజు కాదు. ఈరోజు  ప్రయాణాలు వాయిదా వేస్తారు. పనులలో ఆటంకాలు. ఈరోజు పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ఆరోగ్యభంగం. ఈరోజు వ్యాపారాలు, ఉద్యోగాలలో స్వల్ప అవాంతరాలు. పరిహారాలుః మెరుగైన ఆరోగ్య ప్రయోజనాల కోసం సూర్య రాధన చేయండి.

 

కుంభరాశి:అనవసర ఖర్చుల వల్ల ఇబ్బందులు !

ఈరోజు ఆరోగ్య విషయంలో జాగ్రత్త . ఈరోజు అనవసర ఖర్చుల వల్ల ఇబ్బందులు. వ్యాపారస్తులు నష్టాలు చవిచూస్తారు, అంతేకాకుండా మీరు మీ వ్యాపారాభి వృద్ధి కొరకు ధనాన్ని ఖర్చుచేస్తారు. మీ మనసు చెప్పిన దానికంటే, మేధకే పదును పెట్టవలసిన రోజు.

పరిహారాలుః ఆవునెయ్యితో శ్రీలక్ష్మీదేవి దగ్గర దీపారా ధన చేయండి.

 

మీనరాశి:ఈరోజు ఆనందంగా ఉంటారు !

ఈరోజు మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. కుటుంబంలో సమస్యలు తగ్గుతాయి. కుటుంబంతో ఎక్కువ సమయం గడుపుతారు. రోజంతా ఆనందంగా ఉంటారు. కొత్త పనులు చేపట్టడానికి అనుకూల సమయం. మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. ఈరోజు ఆలయాలు సందర్శిస్తారు. పనుల్లో పురోగతి. ఈరోజు చిన్ననాటి విషయాలు గుర్తుకు వస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యలు తీరతాయి.

పరిహారాలుః శ్రీవేంకటేశ్వర ఆరాధన చేయండి.

 

  • శ్రీ

 

Read more RELATED
Recommended to you

Exit mobile version