సౌత్ ఆఫ్రికా స్టార్ ఆటగాడు క్వింటన్ డీకాక్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. అంతర్జాతీయ టెస్టు క్రికెట్ కు క్వింటన్ డీకాక్ గుడ్ బై చెప్పాడు. క్వింటన్ డీకాక్ 29 ఏళ్ల వయస్సులోనే ఇలాంటి నిర్ణయం తీసుకోవడంపై అతని అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. సెంచూరియన్ వేదికగా భారత్ తో జరిగిన తొలి టెస్టు తర్వాత క్వింటన్ డీకాక్ రిటైర్మెంట్ అనౌన్స్ మెంట్ ఇచ్చాడు. ఇక నుంచి అంతర్జాతీయ టెస్టులను ఆడనని ప్రకటించారు. కానీ వన్డేలు టీ 20 లలో ఆడుతానని తెలిపాడు. ఇక నుంచి వన్డేలు, టీ 20 ల పైనే తను ఫోకస్ చేస్తానని తెలిపాడు.
దీనివల్ల వన్డేలు, టీ 20 లలో మరింత రాణించే అవకాశం ఉంటుందని అభిప్రాయ పడ్డాడు. అయితే సెంచూరీయన్ వేదికగా జరిగిన మ్యాచ్ లో భారత్ చేతిలో సౌత్ ఆఫ్రికా భారీ తేడాతో ఓటమి పాలైయింది. ఈ ఓటమితోనే క్వింటన్ డీకాక్ టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించాడని తెలుస్తుంది. ఇదీల ఉండగా క్వింటన్ డీకాక్ సౌత్ ఆఫ్రికాకు వికెట్ కీపర్ గా వ్యవహరించాడు. ఆ జట్టులో వికెట్ కీపర్ గా డీకాక్ అనేక రికార్డులు ఉన్నాయి. అలాగే డీకాక్ ఇప్పటి వరకు 54 టెస్టు మ్యాచ్ లు ఆడాడు. అందుల్లో 3.300 పరుగులను డీకాక్ సాధించాడు. వీటిలో డీకాక్ 6 శతకాలు, 22 అర్థ శతకాలు ఉన్నాయి.