దీక్షిత్ రెడ్డి మర్డర్ కేసు నిందితుడు సూసైడ్ అటెంప్ట్.. ప్లగ్ లో వేలు పెట్టి !

-

రెండు తెలుగు రాష్ట్రాల్లో కలకలం సృష్టించిన మహబూబాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన 9 ఏళ్ల బాలుడు దీక్షిత్  రెడ్డి కిడ్నాప్ కేసులో మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. ఆ బాలుడిని  కిడ్నాప్ చేసి చంపిన నిందితుడు మంద సాగర్ వరంగల్ సెంట్రల్ జైల్ లో ఆత్మహత్య యత్నం చేశాడు. వరంగల్  సెంట్రల్ జైల్లో తనకు కరెంట్ బోర్డ్ లో వేలుపెట్టి ఆత్మహత్యాయత్నం చేశాడు.

వెంటనే స్పందించిన జైలు సిబ్బంది అతన్ని కాపాడారు. ఆత్మహత్యాయత్నం చేసిన సాగర్ ని హుటాహుటిన ఎంజీఎం హాస్పిటల్ లో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. అయితే సాగర్ ఇలా ఎందుకు సూసైడ్ అటెంప్ట్ చేశాడు, అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఈజీగా డబ్బు సంపాదించవచ్చని స్కెచ్ వేసిన సాగర్ తన స్నేహితుడి మేనల్లుడిని కిడ్నాప్ చేశాడు. అయితే తన గురించి ఇంట్లో ఎక్కడ చెబుతాడో అనే అనుమానంతో ఆ బాలుడ్ని చంపి కాల్చేశాడు. ఇక పోలీసులతో పని చేసిన అనుభవం ఉండడంతో దానిని ఈ కేసు నుండి తప్పించుకోవడానికి వాడాడు సాగర్. 

Read more RELATED
Recommended to you

Exit mobile version