ఆంధ్రా-ఒడిశా సరిహద్దుల్లో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. ఈ రోజు నుంచి PLGA ద్విశతాబ్ది వారోత్సవాలు జరుగనున్న నేపథ్యంలో ఆంధ్ర ఒరిస్సా బోర్డర్ ఏదైనా అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకుంటాయని భావిస్తున్నారు పోలీసులు. దీంతో అక్కడ అప్రమత్తమైన పోలీసులు ముమ్మరంగా కూంబింగ్ చేపట్టారు. పాడేరు ఏజెన్సీలో భారీ ఎత్తున పోలీసు బలగాలు మోహరించాయి.
ముంచంగిపుట్టు, పెదబయలు, జి.మాడుగుల మండలాల్లో భారీ ఎత్తున కొనసాగుతోంది పెద్ద ఎత్తున బాంబు స్క్వాడ్ విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నారు. అలాగే మారుమూల గ్రామాల్లో పర్యటించవద్దని రాజకీయ నేతలకు పోలీసు అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. అవుట్ పోస్టుల పరిధిలో డ్రోన్ కెమెరాలతో నిఘా పెట్టారు పోలీసులు. అంతేకాక మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో బస్సు సర్వీసులు నిలిపి వేసే యోచనలో ఆర్టీసీ ఉన్నట్లు తెలుస్తోంది. PLGA అంటే పీపుల్స్ లిబరేషన్ గొరిల్లా ఆర్మీ.