నాంపల్లి క్రిమినల్ కోర్టుకు దీపా దాస్ మున్షీ

-

రాష్ట్ర కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దీపా దాస్ మున్షీ మంగళవారం నాంపల్లి క్రిమినల్ కోర్టుకు హాజరయ్యారు. గతంలో బీజేపీ నేత ప్రభాకర్ చేసిన ఆరోపణల నేపథ్యంలో ఆయనపై ఆమె పరువు నష్టం దావా వేసిన విషయం తెలిసిందే. సదరు కేసుపై విచారణ నేపథ్యంలో దీపా దాస్ మున్షీ కోర్టుకు హాజరయ్యారు. మున్షీతో పాటు బీజేపీ నేత ప్రభాకర్ సైతం హాజరయ్యారు.

రాజకీయ నేతలకు అండగా నిలిచేందుకు వారి నుంచి దీపా దాస్ మున్షీ బహుమతులను స్వీకరించానని, ఓ రాజకీయ నేత నుంచి మెర్సిడెస్ బెంజ్ కారును బహుమతిగా పొందారని బీజేపీ నేత ప్రభాకర్‌ ఓ టీవీ చానల్‌ ఇంటర్వ్యూలో ఆమెపై సంచలన ఆరోపణలు చేశారు. ఆ వ్యాఖ్యలను ఖండించిన ఆమె.. ప్రభాకర్ తన పరువు ప్రతిష్టలకు భంగం కలిగించారంటూ కోర్టులో డిఫమేషన్ కేస్ ఫైల్ చేశారు. మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్‌తో పాటు కాంగ్రెస్‌ కార్యకర్తలు పార్థాభౌమిక్‌, శుభలక్ష్మిని ఆ పిల్‌లో సాక్ష్యులుగా చేర్చిన విషయం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Exit mobile version