ఢిల్లీ ఊపిరి పీల్చుకుంటుంది…

-

గత 20 రోజులుగా వాయుకాలుష్యంతో ఢిల్లీ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. తాజాగా గాలి నాణ్యత మెరుగుపడటంతో ఊపిరి పీల్చుకుంది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ దారుణంగా పడిపోవడంతో గాలి కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరుకుంది. ఢిల్లీలో వాయుకాలుష్యం పై సుప్రీం కోర్ట్ కూడా కీలక వ్యాఖ్యలు చేసింది. అవసరమైతే లాక్ డౌన్ విధించమని ఆదేశించింది. దీపావళి అనంతరం పంజాబ్, హర్యానాలలో పంట వ్యర్థాలను కాల్చడంతో పాటు దీపావళికి ప్రజలు క్రాకర్స్ కాల్చడం మూలంగా ఢిల్లీలో వాయుకాలుష్యం పెరిగింది. ఇటీవల కాలంలో ప్రతీ రోజు దాదాపు ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్( AQI) 400 పైగానే ఉంది. ’వెరీపూర్‘ కేటగిరిలోనే వాయు నాణ్యత నమోదవుతుండటంతో జనాలు ఇబ్బందులు పడుతున్నారు.

అయితే తాజా నివేదిక ప్రకారం ఢిల్లీలో వాయుకాలుష్యం తగ్గింది. బుధవారం ఉదయం ఢిల్లీలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్( AQI) 280గా నమోదైంది. గత 20 రోజులుగా ఢిల్లీలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్( AQI) 400కు పైనే ఉంది. వెరీపూర్ నుంచి సివియర్ కేటగిరీల మధ్య గాలినాణ్యత ఉండేది. ఇటీవల కాలంలో పంజాబ్, హర్యానా, ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రాలు వాయు కాలుష్యంపై ప్రత్యేక చర్యలు తీసుకోవడంతో పాటు ఢిల్లీలో వాహనాల రద్దీని తగ్గించేందుకు పాఠశాలలకు సెలవులు ప్రకటించడంతో పాటు ఉద్యోగులందరికి వర్క్ ఫ్రం హోమ్ ఇచ్చారు. దీనికి తోడు గాలి ప్రవాహ దిశల్లో మార్పుల వల్ల కూడా ఢిల్లీలో ప్రస్తుతం గాలి నాణ్యత మెరుగుపడింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version