రైల్వే ఉద్యోగాల స్కామ్​లో లాలూ ఫ్యామిలీకి బెయిల్​

-

రైల్వే ఉద్యోగాల స్కామ్​లో ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్‌ యాదవ్​ కుటుంబానికి ఊరట లభించింది. ఈ కేసులో లాలూకు, ఆయన భార్య రబ్రీదేవి, కూతురు మిసా భారతికి దిల్లీ న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. ఒక్కొక్కరికీ 50 వేల చొప్పున వ్యక్తిగత పూచీకత్తుపై వారికి కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది.

లాలూ ప్రసాద్ రైల్వే మంత్రిగా ఉన్నప్పుడు రైల్వే ఉద్యోగాలకు భూములు తీసుకున్నారని సీబీఐ.. లాలూ కుటుంబంపై అభియోగాలు మోపింది. అయితే ఇదంతా రాజకీయ ప్రేరేపితమైన కేసని ఆర్జేడీ ఆరోపిస్తోంది. బీజేపీ చెప్పినట్లే సీబీఐ ఆడుతోందని విమర్శించింది. ఈ కేసులో సీబీఐ కోర్టు ఆదేశాల మేరకు దిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టుకు లాలూ, రబ్రీదేవి, మిసా భారతి బుధవారం హాజరయ్యారు. ఒక్కొక్కరికీ 50 వేల చొప్పున వ్యక్తిగత పూచీకత్తుపై వారికి కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది.

లూ కుటుంబ సభ్యులకు బెయిల్​ రావడంపై ఆర్​జేడీ సభ్యులు పట్నాలోని శాసనసభ ప్రాంగణంలో లడ్డూలు పంచిపెట్టారు. ఇదే సమయంలో అక్కడ ఉన్న బీజేపీ ఎమ్మెల్యేలు.. ఆర్​జేడీ ఎమ్మెల్యేలు బలవంతంగా తమకు లడ్డూలు తినిపించి, ఇబ్బంది పెట్టారని ఆరోపించారు. ఈక్రమంలో ఇరు పార్టీల నాయకులు గొడవ పడ్డారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version