రేవంత్‌కు భట్టితో చెక్..పాదయాత్ర ప్లానింగ్ అదే!

-

తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు కొనసాగుతూనే ఉన్నాయి. పైకి ఏమో తాము అంతా కలిసే ఉన్నామని నేతలు చెబుతున్నారు..కానీ దానికి తగ్గట్టుగా పరిస్తితులు ఉండటం లేదు. ఎవరికి వారే యమునా తీరే అన్నట్లు ఉన్నారు. అయితే టి‌పి‌సి‌సి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పాదయాత్ర చేయడంతో కాంగ్రెస్ లో కొందరు నేతలు ఇబ్బంది పడుతున్నారు. పాదయాత్ర వల్ల రేవంత్ ఇమేజ్ పెరిగిపోతుందని టెన్షన్ పడుతున్నారు. దీంతో కాంగ్రెస్ అధిష్టానంతో ఒప్పించి మిగతా నేతలు కూడా పాదయాత్రకు సిద్ధమవుతున్నారు.

ఈ క్రమంలోనే ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్‌ ఏలేటి మహేశ్వర్‌రెడ్డి పాదయాత్ర మొదలుపెట్టారు. ఈ పాదయాత్రకు ఇంచార్జ్ మాణిక్ థాక్రే కూడా వచ్చారు. కానీ ఏమైందో గాని సడన్ గా ఆయన పాదయాత్ర ఆపేయాలని సూచనలు వచ్చాయి. పాదయాత్రను అర్ధంతరంగా నిలిపివేయాలని ఏఐసీసీ రాష్ట్ర ఇన్‌చార్జి మాణిక్‌థాక్రే చెప్పారు. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ మహేశ్వర్‌రెడ్డి లేఖ రాశారు. పార్టీకి కట్టుబడి పనిచేసే తన పాదయాత్ర ఆపటం కలిచివేసిందని లేఖలో పేర్కొన్నారు. తన పాదయాత్ర ఆపేయటం వెనుక ఎవరున్నారో చెప్పాలని మహేశ్వర్‌రెడ్డి డిమాండ్‌ చేశారు.

అయితే ఏలేటి పాదయాత్ర నిలిపివేయగా, మరోవైపు భట్టి విక్రమార్క పాదయాత్ర మొదలుకానుంది. ఈ నెల 16న నుంచి భట్టి పాదయాత్ర మొదలవుతుంది. 91 రోజుల పాటు 39 అసెంబ్లీ స్థానాల్లో భట్టి పాదయాత్ర జరగనుంది. దాదాపు 1300 కిలోమీటర్ల మేర భట్టి పాదయాత్ర జరగుతుంది.

ఈ పాదయాత్ర చాలామంది సీనియర్ నేతల నియోజకవర్గాలు కవర్ అయ్యేలా జరగనుంది..అంటే రేవంత్ తో పడని సీనియర్ల స్థానాలు కవర్ అవుతాయి. భట్టి పాదయాత్రలో పెద్ద ఎత్తున సీనియర్లు కూడా పాల్గొనే ఛాన్స్ ఉంది. రేవంత్ పాదయాత్ర కంటే భట్టి పాదయాత్రని ఇంకా సక్సెస్ చేసి తమ సత్తా చాటాలని సీనియర్లు చూస్తున్నారు. చూడాలి మరి భట్టి పాదయాత్ర ఎలా సాగుతుందో.

Read more RELATED
Recommended to you

Exit mobile version