టిఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొంటూ బిజెపి రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయింది – మనిష్ సిసోడియా

-

మొయినాబాద్ ఫామ్ హౌస్ లో టిఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుంది. ఈ వ్యవహారం పై ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా స్పందించారు. తెలంగాణ ఎమ్మెల్యేలను కొంటూ బీజేపీ రెడ్ హ్యాండడ్ గా దొరికిందని అన్నారు. పదవులు, డబ్బులతో ఎమ్మెల్యేలను బీజేపీ ప్రలోభాలకు గురిచేస్తుందని ఆరోపించారు మనీష్ సిసోడియా. మీరు మా పార్టీలో చేరితే ఈడీ, సీబీఐలు మీ జోలికి రావంటు ఆడియోలో బీజేపీ చెబుతోందని.. ఎమ్మెల్యేలను కొనడానికి వేల కోట్ల రూపాయలు వెచ్చిస్తుందని మండిపడ్డారు.

ఇంత డబ్బు బీజేపీకీ ఎక్కడి నుంచి వస్తుంది? అని ప్రశ్నించారు. ఢిల్లీలో మా ప్రభుత్వాన్ని కూడా కూల్చే ప్రయత్నం చేశారని చెప్పుకొచ్చారు మనీష్ సిసోడియా. ఈ కొనుగోలు వ్యవహారం వెనకాల అమిత్ షా ఉండడం సిగ్గుచేటన్నారు. ఇక ఈ కేసులో నిందితులకు హైకోర్టు రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే. ముగ్గురు నిందితులను వెంటనే సైబరాబాద్ పోలీస్ కమిషనర్ ముందు లొంగిపోవాలని హైకోర్టు ఆదేశించింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version