లిక్కర్ స్కామ్: గురి తప్పకుండా?

-

ఇటీవల ఢిల్లీ లిక్కర్ స్కామ్..దేశ రాజకీయాలని కుదిపేస్తున్న విషయం తెలిసిందే. ఢిల్లీలోని అరవింద్ కేజ్రీవాల్ సర్కార్…లిక్కర్ పాలసీలో అక్రమాలకు పాల్పడిందని బీజేపీ ఆరోపిస్తుంది. ఇదే క్రమంలో సి‌బి‌ఐ, ఈడీ కూడా కేసులు బుక్ చేసి…సోదాలు చేస్తున్నాయి. ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ రెండు తెలుగు రాష్ట్రాలని కూడా కుదిపేస్తున్నాయి. ఈ లిక్కర్ స్కామ్‌లో కొందరు రాజకీయ నేతలకు ప్రమేయం ఉందని ఆరోపణలు వస్తున్నాయి. ఇదే క్రమంలో కేసీఆర్ కుమార్తె కవితకు లిక్కర్ స్కామ్‌లో ప్రమేయం ఉందని ఢిల్లీకి చెందిన బీజేపీ ఎంపీలు ఆరోపించారు.

అయితే ఈ స్కామ్‌తో తనకు ఎటువంటి సంబంధం లేదని కవిత చెప్పారు…అయినా సరే ఆమె పేరు పదే పదే ప్రస్తావనకు వస్తూనే ఉంది. ఈ క్రమంలోనే తాజాగా లిక్కర్‌ స్కామ్‌లో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) అధికారులు దేశవ్యాప్తంగా ఆరు రాష్ట్రాల్లోని 32 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు. హైదరాబాద్‌లోని ఆరు చోట్ల సోదాలు జరిగాయి. కోకాపేటలోని ఈడెన్‌గ్రీన్‌ గేటెడ్‌ కమ్యూనిటీ టౌన్‌షి్‌పలోని.. ఇండోర్‌ స్పిరిట్స్‌ అధినేత రామచంద్ర పిళ్లై ఇంట్లో ఎనిమిది మంది ఈడీ అధికారులు జరిపిన తనిఖీల్లో కొన్ని కీలక పత్రాలు లభ్యమైనట్లు తెలిసింది. ఈ క్రమంలోనే పిళ్లైకి చెందిన రెండు వేర్వేరు సంస్థల్లో గండ్ర ప్రేమ్‌సాగర్‌, బోయినపల్లి అభిషేక్‌రావు డైరెక్టర్లుగా ఉన్నట్లు గుర్తించిన ఈడీ.. హైదరాబాద్‌లోని వారి ఇళ్లలో కూడా సోదాలు నిర్వహించింది. అయితే అభిషేక్‌రావు…కవిత సన్నిహితుడు అని కథనాలు వస్తున్నాయి.

అంటే కవితని టార్గెట్ చేసి…పరోక్షంగా కేసీఆర్‌ని ఇరుకున పెట్టడమే బీజేపీ వ్యూహామని ప్రచారం జరుగుతుంది. అయితే దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన ఈ లిక్కర్ స్కామ్‌ తెలంగాణలో రాజకీయాలని ఎలా ప్రభావితం చేస్తాయో చూడాలి. ఇందులో కవిత పాత్ర ఉందా లేదా అనే విషయంలో మాత్రం క్లారిటీ రావడం లేదు. కానీ కవిత సన్నిహితులని మాత్రం ఈడీ టార్గెట్ చేసినట్లు తెలిసింది. చూడాలి మరి చివరికి ఈ లిక్కర్ స్కామ్‌ ఏ మలుపు తిరుగుతుందో.

Read more RELATED
Recommended to you

Exit mobile version