ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఇరు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా సంచలనం రేకెత్తిస్తున్న సంగతి తెలిసిందే. ఢిల్లీ లిక్కర్ స్కామ్ నిందితులకు షాక్ తగిలింది. ఈ కేసులో నిందితుల బెయిల్ కోసం సీబీఐ కోర్టును ఆశ్రయించారు. బెయిల్ పిటిషన్‌పై న్యాయస్థానం విచారణ జరిపింది. ఇరు వాదనలు విన్న కోర్టు నిందితులకు బెయిల్ నిరాకరించింది. ఈ కేసులో నిందితులుగా ఉన్నా… సమీర్‌మహేంద్రు, విజయ్‌నాయర్, బినోయ్‌బాబు, అభిషేక్ బోయినపల్లి, శరత్‌చంద్రారెడ్డి బెయిల్ పిటిషన్లను సీబీఐ కోర్టు తిరస్కరించింది. మరోవైపు ఈ కేసుకు సంబంధించి ఆప్ నేత విజయ్ నాయర్, వ్యాపారవేత్త సమీర్ మహేంద్రు ఇళ్లను ఈడీ అటాచ్ చేసింది. దీంతో పాటు దినేశ్ అరోరాకు చెందిన రెస్టారెంట్ ను, అమిత్ అరోరాకు చెందని ఆస్తులను కూడా అటాచ్ చేసింది.
సమీర్ మహేంద్రుకు చెందిన రూ.35 కోట్ల ఆస్తులను ఈడీ అధికారులు అటాచ్ చేశారు. అలాగే అమిత్‌అరోరాకు చెందిన రూ.7.68 కోట్లు, విజయ్‌నాయర్‌కు చెందిన రూ.1.77 కోట్లు, దినేష్ అరోరాకు చెందిన రూ.3.18 కోట్లు, అరుణ్ పిళ్లైకి చెందిన రూ.2.25 కోట్లు, ఇండో స్పిరిట్‌కు చెందిన రూ.14.39 కోట్ల ఆస్తులను అటాచ్ చేశారు. కాగా ఢిల్లీ లిక్కర్ పాలసీ వ్యవహారంలో రూ.2,873 కోట్ల స్కామ్ జరిగిందని, ఇప్పటి వరకు రూ. 76.54 కోట్ల నగదును పట్టుకున్నామని ఈడీ అధికారులు వెల్లడించారు.