ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఢిల్లీ మాజీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా జ్యుడీషియల్ కస్టడీని పొడిగించింది ఢిల్లీ రౌస్ ఎవెన్యూ కోర్టు. మనీష్ సిసోడియా రిమాండ్ ను మే 1వ తేదీ వరకు పొడిగించింది. అయితే కాసేపటికే మళ్లీ సిసోడియా కస్టడీ పొడగింపులో మార్పులు చేసింది కోర్టు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో మనీష్ సిసోడియా ఈడి, సిబిఐ కేసుల్లో జ్యుడీషియల్ కస్టడీ ఏప్రిల్ 17తో ముగిసింది.
దీంతో ఆయనని నేడు ఢిల్లీ రౌస్ ఎవెన్యూ కోర్టులో హాజరు పరిచారు. సిబిఐ కేసులో ఏప్రిల్ 27 వరకు, ఈడీ కేసులో ఏప్రిల్ 29 వరకు సిసోడియా జ్యుడీషియల్ కస్టడీని కోర్టు పొడిగించింది. మరోవైపు ఇదే కేసులో అరెస్ట్ అయిన హైదరాబాద్ వ్యాపారవేత్త అరుణ్ రామచంద్ర పిల్లై కస్టడీని మాత్రం మే 1వ తేదీ వరకే పొడగిస్తున్నట్లు కోర్టు తెలిపింది.