బండి సంజయ్ బెయిల్ రద్దు పిటిషన్ పై తీర్పు వాయిదా

-

పదవ తరగతి ప్రశ్నాపత్రం లీకేజీ కేసులో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ బెయిల్ నీ రద్దు చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది. కేసు దర్యాప్తుకు బండి సంజయ్ సహకరించడం లేదని, సెల్ ఫోన్ ఇవ్వడం లేదని వరంగల్ జిల్లా కోర్టుకు తెలిపారు ప్రభుత్వ తరపు న్యాయవాది.

అటు బెయిల్ షరతులు ఉల్లంఘించి బండి సంజయ్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఆరోపించారు. కాగా కింది కోర్టుకు వెళ్లాలని జడ్జ్ ఆదేశించగా.. దిగువ కోర్టులో మరో పిటిషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో ఈ పిటిషన్ పై తీర్పును హనుమకొండ కోర్టు రేపటికి వాయిదా వేసింది. ఇరుపక్షాల వాదనలు విన్న ఫోర్త్ ఎంఎం న్యాయస్థానం తీర్పును మంగళవారానికి వాయిదా వేసింది.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version