కేజ్రీవాల్ ని చంపడానికి కుట్ర జరుగుతోంది అని ఢిల్లీ మంత్రి సౌరబ్ భరద్వాజ్ అన్నారు ఆయన ఆరోగ్యం దెబ్బతినేలా సకాలంలో మందులు ఇవ్వకూడదని కేంద్రం ఆలోచిస్తుందని ఫైర్ అయ్యారు. కొన్ని నెలల తర్వాత కేజ్రీవాల్ జైలు నుండి బయటకి వచ్చాక కాలేయం ఊపిరితిత్తులు లేదంటే గుండెకి చికిత్స పొందుతూ క్రమంగా మరణించే ఛాన్స్ ఉందని అన్నారు.
కేజ్రీవాల్ కి ఇన్సులిన్ అవసరమైతే ఇన్సులిన్ ఇవ్వాల్సిందేనని మేము కోరుకుంటున్నాము అని ఢిల్లీ మంత్రి అన్నారు. జైలులో ఉన్న కేజ్రీవాల్ బ్లడ్ షుగర్ రీడింగ్ ని ఉద్దేశించి ఈ కామెంట్లు చేశారు. ఇన్సులిన్ ఇవ్వనందుకు తీహార్ జైలు అధికారులు పై మండిపడ్డారు అలానే ఢిల్లీ ఎల్జి పై కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. చాలా ఏళ్ల నుండి డయాబెటిస్తో బాధపడుతున్నారని ఆయన గుర్తు చేశారు. తన పర్సనల్ డాక్టర్ ని కలవడానికి అనుమతించాలని ఢిల్లీ కోర్టుని ఆశ్రయించారు.