విశాఖ ఆక్సిజన్ టవర్స్‌లో డెలివరీ బాయ్‌పై దాడి వ్యవహారంలో సీసీ కెమెరా విజువల్స్ ఒక్కసారిగా బయటకు రావడంతో అంతా షాక్ అవుతున్నాయి. డెలివరీ బాయ్ అనిల్ పై అత్యంత పాశవికంగా ఫ్లాట్ ఓనర్ ప్రసాద్ వ్యవహరించినట్లు తెలుస్తోంది.
అనిల్‌ను బయటకు వెళ్లనివ్వకుండా వాచ్‌మెన్స్‌తో గేట్లు వేయించి మరీ ప్లాస్టిక్ పైప్ తో విచక్షణారహితంగా ప్రసాద్ దాడి చేసినట్లు సమాచారం. అంతేకాకుండా డెలివరీ బాయ్ అనిల్ బట్టలు విప్పించి అండర్ వేర్ మీద గేట్ బయటకు ప్రసాద్ పంపించాడు.దీనిపై తాజాగా బాధితుడు మీడియాతో మాట్లాడుతూ.. సార్ అని పిలవనందుకు కులం పేరుతో దూషించి నాపై ఫ్లాట్ ఓనర్ ప్రసాద్ దాడి చేశాడుని ఆవేదన వ్యక్తం చేశాడు.