సీఎం చంద్రబాబును జపాన్ రాయబారి కైచి ఒనో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జపాన్ రాయబారితో పాటు వచ్చిన అక్కడి వివిధ అధికారులతో పాటు రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో కలిసి సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఇరు నేతల మధ్య కీలక చర్చలు జరిగాయి. ఏపీలో జపాన్ పెట్టుబడులు, ఆర్థిక సంబంధాలు, నూతన అవకాశాలపై చర్చించినట్లు సీఎం చంద్రబాబు నాయుడు సోషల్ మీడియా వేదికగా ట్వీట్ చేశారు. షిప్ బిల్డింగ్, ఎలక్ట్రానిక్స్, కెమికల్స్ సహా విద్యా రంగాల్లో పరస్పర సహకారంపై చర్చించినట్లు సీఎం చంద్రబాబు వివరించారు.