ఢిల్లీలో డెంగ్యూ కలకలం.. పెరుగుతున్న కేసుల తీవ్రత.

-

ఇప్పటికే దేశం కరోనాతో సతమతమవుతోంది. ఉత్తర్ ప్రదేశ్ జీకా వైరస్ తో, కేరళ నోరో వైరస్ తో కలవర పడుతున్నాయి. మరోవైపు ఢిల్లీ డెంగ్యూ కేసుల కలకలం రేగుతోంది. కేసుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. గతంలో ఏ సంవత్సరంలో లేని విధంగా ఢిల్లీని డెంగ్యూ కేసులు కలరవపెడుతున్నాయి. ఈ ఏడాది ఇప్పటి వరకు 5277 కేసులు నమోదైనట్లు ఢిల్లీ మున్సిపల్ కార్పోరేషన్ నివేదిక తెలుపుతోంది. కేవలం ఒకే వారంలో 2569 కేసులు నమోదవడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. 2016-20 మధ్య కాలంతో పోలిస్తే ఈ ఏడాది నమోదైన కేసులు అధికంగా ఉన్నాయి. 2106 లో 4431 డెంగ్యూ కేసులు, 2017లో 4726 కేసులు, 2108లో 2798 కేసులు, 2019లో 2036 కేసులు, 2020లో  1072 కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం మాత్రం కేసుల సంఖ్య 5 వేలను దాటింది. గతేడాది కరోనా కారణంగా లాక్ డౌన్ విధించారు. దీంతో ప్రజలు ఇళ్లకే పరిమితం అవడంతో కేసుల సంఖ్య గణనీయంగా తగ్గింది. కానీ ఈ ఏడాది పరిస్థితి వ్యతిరేఖంగా ఉంది. ఇప్పటి వరకు డెంగ్యూ కారణంగా ఢిల్లీలో 9 మంది మరణించారు. కాగా వాతావరణ మార్పులు చోటు చేసుకోవడంతో రానున్న వారం పదిరోజుల్లో కేసుల సంఖ్య తగ్గే అవకాశం ఉందని ఢిల్లీ సర్కార్ చెబుతోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version