దారుణం.. తమ్ముడి కూతురిపై అత్యాచారం..!

-

దేశంలో అత్యాచారాలు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. కామంతో కళ్ళు మూసుకుపోయిన కొందరు నరరూప రాక్షసులు సొంతవారినే చిదిమేస్తున్నారు. ఆడది కనిపిస్తే చాలు రెచ్చిపోతాం, వయస్సుతో సంబంధం లేకుండా మా ఆకలి తీర్చుకుంటాం. అడ్డం అనుకుంటే చంపేస్తాం. ఇది నేటి సమాజంలోని కొంత మంది మానవ మృగాల వికృతచేష్టలకు ప్రతిరూపం. ఒకడు తల్లిని, మరొకడు తోబుట్టువుని, ఇంకోకడు కడుపున పుట్టిన కూతుర్ని ఇలా వావివరసలు మర్చిపోయి మృగాళ్ల మీద పడిపోతున్నారు ఈ కామాంధులు. తాజాగా.. హైదరాబాద్ లో ఇలాంటి ఘోరమైన సంఘటనే ఒకటి జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. పేట్‌బషీరాబాద్ లో నివాసముంటున్న ఆ వ్యక్తి దంత వైద్యుడిగా సేవలు అందిస్తున్నాడు. అతని తమ్ముడు కూడా కుటుంబంతో కలిసి అదే ప్రాంతంలో ఉంటున్నాడు.

ఇద్దరు అన్నదమ్ములు కావడంతో ఒకరి ఇంటికి ఒకరు వస్తూ.. పోతూ.. ఉంటారు. ఈ క్రమంలోనే ఆ డాక్టర్ తన వక్రబుద్ధి చూపించాడు. 21 ఏళ్ల తమ్ముడి కూతురిపై కన్నేశాడు. అక్కడక్కడ తాకుతూ యువతితో అసభ్యంగా ప్రవర్తించేవాడు. అయితే పెదనాన్న కావడంతో ఆ యువతికి అతని వక్రబుద్ది అర్ధం కాలేదు. ఆ డాక్టర్ మాత్రం తనని ఎలాగైనా అనుభవించాలని అనుకున్నాడు. ఈ నేపధ్యంలో ఓ రోజు ఆ యువతి తన పెదనాన్న ఇంటికి వచ్చింది. అయితే సమయానికి ఇంట్లో ఎవరూ లేరు, ఒక్క డాక్టర్ తప్ప.

ఇదే అదునుగా భావించిన నీచపు డాక్టర్.. తమ్ముడి కూతురిని బెదిరించి శారీరకంగా లొంగదీసుకున్నాడు. పైగా ఈ విషయాన్ని బయటికి చెబితే చంపేస్తానని బెదిరించాడు. మొదట్లో తనలో తాను కుమిలిపోయిన ఆ యువతి, తర్వాత ఈ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో వారు షీ టీమ్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version