ఉప ముఖ్యమంత్రికి కరోనా పాజిటివ్..!

-

దేశంలో శరవేగంగా వ్యాప్తిచెందుతున్న మహమ్మారి కరోనా వైరస్ సామాన్యులు సెలబ్రిటీలు ప్రజా ప్రతినిధులు అధికారులు అనే తేడా చూడటం లేదు అన్న విషయం తెలిసిందే. ప్రతి ఒక్కరిపై పంజా విసురుతూ ఆస్పత్రి పాలు చేస్తుంది ఈ మహమ్మారి కరోనా వైరస్. రోజు రోజుకీ విజృంభిస్తున్న ఈ మహమ్మారి వైరస్ బారిన పడి ఎంతో మంది ప్రాణాలు సైతం కోల్పోతున్నారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఏదో ఒక విధంగా ఈ మహమ్మారి వైరస్ పంజా విసురుతోంది. ముఖ్యంగా వరుసగా ఎంతో మంది ప్రజా ప్రతినిధులు ఈ మహమ్మారి వైరస్ బారిన పడుతుండటం ప్రజలందరిలో మరింత ఆందోళన కలిగిస్తోంది.

ఇక ఇటీవలే హర్యానా ఉప ముఖ్య మంత్రి దుష్యంత్ చౌతాలా కరోనా వైరస్ బారిన పడ్డారు. ఇటీవలే కరోనా నిర్ధారిత పరీక్షలు చేసుకోగా పాజిటివ్ అని తేలింది. అయితే కరోనా లక్షణాలు లేనప్పటికీ మిగతా కరోనా నిర్ధారిత పరీక్షల్లో పాజిటివ్ అని వచ్చిందని… గత కొన్ని రోజుల నుంచి తనతో సన్నిహితంగా ఉన్న వాళ్ళందరూ పరీక్షలు చేసుకోవాలని ఆయన కోరారు. కాగా ఇప్పటికే హర్యానాలో కొంతమంది ప్రజాప్రతినిధులు కరోనా వైరస్ బారినపడి కోలుకుంటున్న విషయం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Exit mobile version