పత్తర్ కా ఘోష్ లాగించిన డిప్యూటీ సీఎం భట్టి..ప్రజా విజయోత్సవాల్లో ఫుల్ జోష్..

-

తెలంగాణలో ప్రజాపాలన విజయోత్సవ వేడుకలు ముగింపు దశకు చేరుకున్నాయి. దీంతో ట్యాంక్ బండ్ సమీపంలోని నెక్లెస్ రోడ్, అంబేడ్కర్ విగ్రహం వద్ద భారీ ఎత్తున స్టాల్స్‌ను ఏర్పాటు చేశారు. వివిధ ఫుడ్ ఐటమ్స్‌తో పాటు పలు రకాల ఐటమ్స్‌ను అందుబాటులో ఉంచారు. ఈ క్రమంలోనే ట్యాంక్ బండ్ హెచ్ఎండిఏ ప్రాంగణం వద్ద ఏర్పాటు చేసిన కబాబ్స్ స్టాల్స్ వద్ద ‘పత్తర్ కా గోష్’(మటన్ కబాబ్స్)ను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇష్టంగా లాగించారు.

ఆయనతో పాటు ప్రభుత్వ సలహాదారులు వేం నరేందర్ రెడ్డి, వేణుగోపాల్,జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి తదితరులు ఉన్నారు. వీరు కూడా పత్తర్ కా ఘోష్ లాగించి అనుభూతిని పొందారు. కాగా, ముగింపు వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా ప్లాన్ చేసింది. ట్యాంక్ బండ్ నుంచి నెక్లెస్ రోడ్ వరకు ప్లెక్సీలు, పూల దండలతో సుందరంగా అలకరించారు.

 

Read more RELATED
Recommended to you

Latest news