ర్యాగింగ్ భూతం కాలేజీల నుంచి పాఠశాలలకు చేరింది. ర్యాగింగ్ చేయడం అనేది తెలంగాణలోని కాలేజీలు, పాఠశాలల్లో నిషేధం. అయినప్పటికీ కొందరు సీనియర్ విద్యార్థులు జూనియర్ల పట్ల విచక్షణా రహితంగా ప్రవర్తిస్తున్నారు. ఈ క్రమంలోనే పాఠశాలలో ర్యాగింగ్ తట్టుకోలేక ఆరవ తరగతి విద్యార్థి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.
ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా గూడూరు ఆశ్రమ బాలుర పాఠశాలలో వెలుగుచూసింది. రుత్విక్ అనే 6వ తరగతి స్టూడెంట్‌ను పదవ తరగతి విద్యార్థులు రోజూ ర్యాగింగ్ చేయడంతో తీవ్రమనస్తాపం చెందిన అతను హాస్టల్లో ఉండే ఎలర్జీ మందును తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. వెంటనే అతన్ని మహబూబాబాద్ ఏరియా ఆసుపత్రికి తరలించగా ప్రస్తుతం చికిత్స అందిస్తున్నారు. సీనియర్ల వేధింపులతో తీవ్ర మనోవేదనకు గురై ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు బాధిత విద్యార్థి ఆవేదన వ్యక్తం చేశాడు.
పాఠశాలలో ర్యాగింగ్ తట్టుకోలేక ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ 6వ తరగతి విద్యార్థి
మహబూబాబాద్ జిల్లా గూడూరు ఆశ్రమ బాలుర పాఠశాలలో రుత్విక్ అనే 6వ తరగతి విద్యార్థిని రోజు ర్యాగింగ్ చేస్తున్న 10వ తరగతి విద్యార్థులు
వేధింపులు తట్టుకోలేక హాస్టల్లో ఉన్న ఎలర్జీ మందును తాగి… pic.twitter.com/j2cwqP788k
— Telugu Scribe (@TeluguScribe) December 8, 2024