స్వాతంత్ర్య సమరయోధుల వారసుల భాగోతం…సంగారెడ్డి జిల్లా కలెక్టర్ సంతకం ఫోర్జరీ !

-

సంగారెడ్డి జిల్లా కలెక్టర్ సంతకాన్ని ఫోర్జరీ చేశారు స్వాతంత్ర్య సమరయోధుల వారసులు. ప్రభుత్వ భూమి అమ్మకానికి పెట్టి నకిలీ NOC క్రియేట్ చేసి అడ్డంగా దొరికిపోయింది ఈ గ్యాంగ్. 1984లో కొల్లూరులోని సర్వే నంబర్ 191లో 74మంది ఫ్రీడమ్ ఫైటర్స్ కి రెండెకరాల చొప్పున భూమి కేటాయించింది ప్రభుత్వం. కొన్ని రోజుల కింద కొన్ని కారణాలతో అందులో రెండెకరాల భూమిని వెనక్కి తీసుకుంది ప్రభుత్వం. టేక్మాల్ కి చెందిన ఐదుగురు స్వాతంత్ర్య సమరయోధుల వారసులు ముఠాగా ఏర్పడి ఆ రెండెకరాల భూమిని విక్రయించేందుకు ప్లాన్ చేశారు.

sangareddy

హైదరాబాద్ కి చెందిన ఓ వ్యక్తికి 40 కోట్ల రూపాయలకు అగ్రిమెంట్ చేసుకుని 3 లక్షలు అడ్వాన్స్ తీసుకుంది ఈ గ్యాంగ్. NOC కావాలని భూమి కొనుగోలుదారు శరతు పెట్టడంతో కలెక్టరేట్ లో బ్రోకర్ గా పనిచేసే శ్రీనివాసచారిని కలిశారు ఫ్రీడమ్ ఫైటర్స్ సన్స్. శ్రీనివాసచారితో మరికొందరు కలిసి కలెక్టర్ సంతకాన్ని ఫోర్జరీ చేసి ఫేక్ NOC క్రియేట్ చేశారు కేటుగాళ్ళు. ఈ విషయం బయటికీ రావడంతో కొల్లూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు రామచంద్రపురం తహశీల్దార్. ఇక దీనిపై కేసు నమోదు చేసుకుని ఐదుగురిని అరెస్ట్ చేశారు పోలీసులు. పరారీలో మరో నలుగురు నిందితులు ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version