6 గ్యారెంటీలు ఇవ్వడంలో కాంగ్రెస్‌ విఫలం..పాదయాత్రకు బీజేపీ ప్లాన్‌ !

-

6 గ్యారెంటీలు ఇవ్వడంలో కాంగ్రెస్‌ విఫలం అయిందని..పాదయాత్రకు బీజేపీ ప్లాన్‌ చేస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వ ఏడాది పాలన లో 6 గ్యారంటీ ల అమలు, ఇచ్చిన హామీలు నెరవేర్చడం విఫలం పై డిసెంబర్ మొదటి వారం లో అసెంబ్లీ ల వారీగా బీజేపీ పాదయాత్రలు , సభలు నిర్వహించనుంది. ఈ కార్యక్రమం పై బీజేపీ వర్క్ షాప్ నిర్వహించనున్నారు.

ఈ కార్యక్రమానికి కిషన్ రెడ్డి , ఎంపీ లు ఎమ్మెల్యేలు హాజరు కానున్నారు. తెలంగాణ రాష్ట్రంలోని బీజేపీ జిల్లా అధ్యక్షులు, రాష్ర్ట పదాదికారులు, పాద యాత్ర ల అసెంబ్లీ ఇన్చార్జి లతో సమావేశం జరుగనుంది. ఈ సమావేశంలో… కాంగ్రెస్ ప్రభుత్వ ఏడాది పాలన లో 6 గ్యారంటీ ల అమలు, ఇచ్చిన హామీలు నెరవేర్చడం విఫలం పై చర్చించనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version