రేవంత్ రెడ్డి గొంతులో వీరమల్లు ముల్లు దిగిందని చురకలు అంటించారు దేశపతి శ్రీనివాస్. అంబేడ్కర్ జయంతి రోజున దళిత మాజీ మండల ప్రజా పరిషత్ అధ్యక్షుడు ముదం సాయిలును పోలీసులు అవమానించిన నైపథ్యంలో ఆత్మగౌరవ గర్జన కార్యక్రమానికి ఏర్పాటు చేసి అతన్ని సత్కరించారుకేటీఆర్. ఈ సందర్బంగా కామారెడ్డిలో దేశపతి శ్రీనివాస్ మాట్లాడారు.

సినిమా వాళ్ళు టికెట్ల రేట్లు పెంచడానికి లేనేలేదు అని చెప్పాడు.. ఇప్పుడు హరిహర వీరమల్లు అనగానే రేవంత్ రెడ్డి గొంతులో ముల్లు దిగిందని చురకలు అంటించారు. పవన్ కళ్యాణ్ అయితే రేట్లు పెంచుకోవచ్చు అని పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్, రేవంత్ రెడ్డి, చంద్రబాబు, మోడీ దాక ఒకటే బంధం ఉంది… తిరిగి తెలంగాణలో టీడీపీ జెండా ఎగరవెయ్యాలనేది వీళ్ళ కుట్ర అని చెప్పారు దేశపతి శ్రీనివాస్. రేవంత్ రెడ్డి స్పీచ్ మొదలు పెట్టగానే ఆటోమేటిక్‌గా ఆగిపోయే టీవీలను, ప్రజలు ఎక్కువ ధర పెట్టి కొంటున్నారు అని సెటైర్లు పేల్చారు దేశపతి శ్రీనివాస్.