ప్రాచీన కట్టడాలున్నా రాష్ట్రం పర్యాటకంగా అభివృద్ధి చెందలేదు :మంత్రి జూపల్లి

-

రాష్ట్రంలో ప్రాచీన కట్టడాలున్నా పర్యాటకంగా అభివృద్ధి చెందలేదని మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. రాష్ట్ర ఆదాయం పెంచే విధంగా త్వరలోనే టూరిజం పాలసీకి రూపకల్పన చేస్తున్నామని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. సెక్రటేరియట్ మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడుతూ ‘రాష్ట్రంలో వనరులున్నా పర్యాటకం అభివృద్ధి చెందలేదు అని అన్నారు. ఇప్పుడు టూరిజం పాలసీ డీపీఆర్ తయారు చేశాం. త్వరలోనే డ్రాఫ్ట్ పాలసీపై ముఖ్యమంత్రితో చర్చించి అమలు చేయబోతున్నాం అని తెలిపారు.

దేశంలో ఉన్న జనాభాలో 30శాతం టూరిజం వైపు మళ్లిస్తే దేశ, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ బలపడుతుంది అని పేర్కొన్నారు. గోల్కొండ తారమతి హోటల్ భూము విలువ వంద కోట్లు అయితే దాని ఆదాయం కోటి మాత్రమే ఉందని తెలిపారు. ప్రైవేట్, ప్రభుత్వం ఆధ్వర్యంలో టూరిజం ఆదాయాన్ని పెంచాలని ప్రణాళికలు చేస్తున్నాం. నల్లమల ఫారెస్ట్ ను త్వరలో విజిట్ చేయబోతున్నాం అని అన్నారు. వెడ్డింగ్ టూరిజానికి స్వీకారం చుట్టబోతున్నం. గ్రామీణ స్థాయికి టూరిజంను, కల్చర్ డిపార్ట్మెంట్ ద్వారా ప్రజల జీవన విధానాన్ని మార్చబోతున్నం అని వెల్లడించారు. అనంతగిరి కొండల్లో వెల్నెస్ రీస్టార్ట్ నిర్మించబోతున్నం. ఎకో, మెడికల్, టెంపుల్ టూరిజంను అభివృద్ధి చేయబోతున్నాం. తద్వారా ఉపాధి అవకాశాలు పెరిగే అవకాశం ఉంది’ అని మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version