రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమం అభివృద్ధిలో దూసుకుపోతున్నదని బీసీ సంక్షేమ, రవాణ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఈ క్రమంలోనే తన సొంత నియోజకవర్గంలోని హుస్నాబాద్ మున్సిపాలిటీ పరిధిలో రూ. 18 కోట్లతో హుస్నాబాద్ ఎల్లమ్మ చెరువు కట్ట సుందరీకరణ, సహా ఇతర అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు.
మున్సిపాలిటీలు, పంచాయతీల అభివృద్ధికి ప్రభుత్వం నిధులు కేటాయిస్తున్నదని, గ్రామాలు, పట్టణాల అభివృద్ధికి సమాంతరంగా కృషి చేస్తున్నదని వివరించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్‌కు గొల్ల కురుమలు గొంగడి కప్పి డోలుతో సన్మానించారు. అనంతరం మంత్రి పొన్నం సైతం వారితో కలిసి ర్యాలీలో డోలు కొట్టి సందడి చేశారు.