వరంగల్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. పర్వతగిరి మండలంలోని ఏనుగల్ గ్రామంలో కరెంట్ షాక్‌తో ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. ఇంట్లో మెట్లు కడుతుండగా ఐరన్ రాడ్ అవసరం వచ్చి అది తీసుకువస్తుండగా.. ప్రమాదవశాత్తు ఇంటిపై ఉన్న 11 కేవీ వైర్లు తగలడంతో మాసాని దిలీప్ (20) దుర్మరనం పాలయ్యాడు.
పర్వతగిరి ఎస్ఐ ప్రవీణ్ కథనం ప్రకారం.. శనివారం మధ్యాహ్నం ఒంటి గంటకు మాసాని దిలీప్ తండ్రి రవి ఏనుగల్ గ్రామం చర్చి పక్కన గల తన ఇంట్లో మెట్లు కడుతుండగా ఐరన్ రాడ్ అవసరం వచ్చింది. బయట ఉన్న ఐరన్ రాడ్ తెస్తుండగా అనుకోకుండా దానిని పైకి లేపే సరికి 11కేవీ వైర్లు తగలడంతో దిలీప్‌కు కరెంట్ షాక్ కొట్టింది. వెంటనే అతన్ని హాస్పిటల్‌కి తరలించి చికిత్స అందించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. తండ్రి రవి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.