బిగ్ బ్రేకింగ్‌: మహారాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడణవీస్ ప్రమాణ స్వీకారం

-

మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడణవీస్ రెండోసారి ప్రమాణ స్వీకారం చేశారు. ఉప ముఖ్యమంత్రిగా అజిత్ పవార్ ప్రమాణ స్వీకారం చేశారు. శనివారం ఉదయం రాజ్‌భవన్‌లో వీరి ప్రమాణ స్వీకార కార్యక్రమం ముగిసింది. మహారాష్ట్రలో సుస్థిర ప్రభుత్వాన్ని తాము ఇస్తామని ప్రమాణ స్వీకార కార్యక్రమం అనంతరం ఫడణవీస్ చెప్పారు.

కాగా, ఫడణవీస్, అజిత్ పవార్‌లకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. మహారాష్ట్ర భవిష్యత్ కోసం వారు పాటుపడతారని మోదీ పేర్కొన్నారు. రాత్రికి రాత్రే అనేక రాజకీయ పరిణామాలు చేసుకున్న నేపథ్యంలో ఎన్సీపీ మద్దతుతో ఫడ్నవిస్‌ సీఎం ప్రమాణంగా చేశారు. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన ఎత్తివేశామని గవర్నర్‌ తెలిపారు. సీఎం పీఠంపై ఆశలు పెట్టుకున్న శివసేనకు ఎన్సీపీ ఊహించని షాక్‌ ఇచ్చింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version