సోషల్ మీడియాలో ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ ఎప్పుడూ కూడా యాక్టివ్ గానే ఉంటూ ఉంటాడు. ఏదోక రూపంలో సోషల్ మీడియాలో అతను అలరిస్తూ ఉంటాడు. అతను ఇప్పుడు హైదరాబాద్ జట్టుకు ఐపిఎల్ లో ఆడుతున్న సంగతి తెలిసిందే. దీనితో తెలుగు ప్రేక్షకులకు అతను బాగా దగ్గరయ్యాడు. తెలుగు ప్రేక్షకులు అతను ఆడుతుంటే అలాగే చూస్తూ ఉంటారు.
గత ఏడాది ఐపిఎల్ లో అతను పాల్గొనలేదు అనే సంగతి తెలిసిందే. ఇక ఇది పక్కన పెడితే తాజాగా అతను భార్యతో కలిసి ఒక పాటకు డాన్స్ వేసాడు. ఆ పాట ఏదో కాదు టాలీవుడ్ లో ఇటీవల విడుదల అయి సూపర్ హిట్ అయిన అల వైకుంఠపురములో సినిమాలోని బుట్ట బొమ్మ పాట. తన భార్య తో కలిసి ఈ పాటకు అతను డాన్స్ వేసి దాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా…
అది విస్తృతంగా వైరల్ అయింది. అతను తన భార్య క్యాండీస్ వార్నర్‌తో కలిసి చేస్తున్న ‘టిక్-టాక్’ వీడియోలో ప్రేక్షకులను బాగా అలరించింది. సన్‌రైజర్స్ హైదరాబాద్ జెర్సీలో వార్నర్ ఈ డ్యాన్స్ చేశాడు. తన పాటకి డ్యాన్స్ చేసినందుకు అల్లు అర్జున్ ‘‘థాంక్యూ’’ అంటూ కామెంట్ చేసాడు. ఈ పాట ఇప్పుడు మరింత పాపులర్ అయింది.
@davidwarner31Oh dear here we go!! First attempt haha. ##buttabomma @candywarner31