ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ ఉన్న నేపధ్యంలో ఇప్పుడు వైసీపీ నేతలు అందరూ కూడా ప్రజా సేవలో పాల్గొని ప్రజలకు అండగా నిలుస్తున్నారు. తమ వంతు సహాయం చేస్తున్నారు. ఎవరికి ఏ ఇబ్బంది రాకుండా చూస్తున్నారు వైసీపీ నేతలు. టీడీపీ నేతలు చేస్తున్నారు లేదా అనే విమర్శలను పక్కన పెట్టి వాళ్ళు ప్రజల్లోకి వెళ్తున్నారు. విజయవాడ వైసీపీ యువనేత, తూర్పు నియోజకవర్గ ఇంచార్జ్ దేవినేని అవినాష్,
ప్రజలకు ఎప్పటికప్పుడు నిత్యావసర సరుకులను అందించే కార్యక్రమం చేస్తున్నారు. దీనిపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతుంది. దీన్ని గమనించిన వైఎస్ జగన్… అవినాష్ కి కీలక పదవి ఇవ్వాలని భావించినట్టు తెలుస్తుంది. కృష్ణా జిల్లా జెడ్పీ చైర్పర్సన్ గా ఆయన్ను ఎంపిక చెయ్యాలని భావిస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ జిల్లాలో సత్తా చాటి ఎక్కువ జిల్లా పరిషత్ లను గెలిస్తే అవినాష్ ని ఆ పదవిలో కూర్చోబెట్టే ఆలోచన చేస్తున్నారు.
తూర్పు నియోజకవర్గ బాధ్యతలతో పాటుగా ఈ బాధ్యతలను కూడా అవినాష్ కి అప్పగిస్తే మంచిది అని మంత్రి కొడాలి నానీ, పెర్ని నానీ జగన్ కి సూచించారు అంటున్నారు. ఈ పదవి కోసం మరో నేత లైన్లో ఉన్నా సరే అవినాష్ నిబద్దత గ్రహించిన జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారని రాజకీయ వర్గాలు అంటున్నాయి. కొన్ని రోజులుగా ఆయన చాలా వరకు ప్రజల్లోనే ఉంటూ వారికి తన వంతు సేవ చేస్తున్నారు.
విజయవాడ మేయర్ ఇవ్వాలి అనుకున్నా సరే ఆ సీటు గెలుస్తారు లేదు అనే దాని మీద నమ్మకం లేదు. దీనితోనే జగన్ ఈ పదవిని అవినాష్ కి ఇవ్వాలని జగన్ భావించినట్టు తెలుస్తుంది. గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నుంచి గుడివాడ నియోజకవర్గంలో ఆయన పోటీ చేసారు. మంత్రి కొడాలి నానీ ప్రత్యర్ధిగా ఆయన బరిలోకి దిగారు. అయితే అక్కడ నానీ బలంగా ఉన్న నేపధ్యంలో అవినాష్ కి ఓటమి ఎదురైంది.