మహేష్ పక్కన స్టార్ హీరో కుమార్తె…!

-

టాలీవుడ్ లో మహేష్ బాబు తో సినిమా చేయడానికి ఎందరో హీరోయిన్ లు పోటీ పడుతూ ఉంటారు. మహేష్ కి ఉన్న క్రేజ్ ఆ రేంజ్ లో ఉంటుంది. మహేష్ తో సినిమా చేయడానికి దర్శకుల నుంచి పోటీ ఏ విధంగా ఉంటుందో హీరోయిన్స్ విషయంలో కూడా అదే విధంగా పోటీ ఉంటుంది. ఆయన పక్కన ఇప్పటి వరకు నటించిన హీరోయిన్స్ అందరూ స్టార్ హీరోయిన్స్ అయ్యారు. వాళ్ళు ఎక్కువ కాలం సినిమాల్లో ఉన్నారు.

దీనితో కొంత మంది ఆయన హ్యాండ్ మంచిది అంటున్నారు. అయితే ఇప్పుడు మహేష్ బాబు పక్కన నటించడానికి ఒక స్టార్ హీరో కూతురు రెడీ అయినట్టు సమాచారం. బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ కుమార్తె… సారా అలీ ఖాన్ మహేష్ తో సినిమా చేయడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నట్టు సమాచారం. తెలుగులో సినిమా చేయడానికి ఆమె ఎప్పటి నుంచొ ప్రయత్నాలు చేస్తుండగా ఇప్పుడు ఆ సినిమా ఓకే అయింది.

మహేష్ బాబు ప్రస్తుతం పరుశురాం దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్ గా సారా అలీ ఖాన్ ని తీసుకునే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ముందు మహేష్ సరసన భరత్ అను నేను సినిమాలో నటించిన కియారా అద్వాని ని తీసుకునే ఆలోచన చేసినా ఆమె కాదు ఈమె అయితే మహేష్ పక్కన సరిపోతుంది అని భావించి ఆమెను ఓకే చేసినట్టు టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version